ఆంధ్రప్రదేశ్‌

బాబు మాటలు నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: రాష్ట్రంలో ఒకటి, రెండు సంఘటనలు మినహా మిగిలిన చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం సాయంత్రం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎన్నికలు సజావుగా జరగడం లేదని ఆరోపణలు చేయడం చూస్తుంటే పచ్చ కామెర్లవానికి లోకమంతా పచ్చగా కన్పించిన చందంగా ఉందన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగకపోతే రాష్ట్రంలో 9696 ఎంపీటీసీల స్థానాలకు 50వేల మంది నామినేషన్లు వేయగా, 652 జెడ్పీటీసీ స్ధానాలకు 1500 మంది నామినేషన్లు ఎలా వేశారని ప్రశ్నించారు. అలాగే మున్సిపల్ వార్డులకు సంబంధించి 20వేల నామినేషన్లు వేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన దుశ్చర్యలను ఆపాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పులతో అధోగతి పాల్చేశారని దుయ్యబట్టారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి రూ.1.90 లక్షల కోట్లు అప్పులు చేయడాన్ని బొత్స తూర్పారబట్టారు. కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంత రైతులకు రైతు భరోసా, విద్యార్థులకు అమ్మఒడి, గోరుముద్దల కార్యక్రమం, వితంతువులకు రూ.2250 పింఛను, 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేశారన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో 4.50 లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. జగన్మోహన్‌రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలను పొరుగున
ఉన్న మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమలు చేయాలని యోచిస్తున్నారన్నారు. చంద్రబాబు 14ఏళ్ల పాలనలో అలాంటి సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న అశోక్‌గజపతిరాజును తొలగించి మరో చైర్మన్‌కు ఆ పీఠం కట్టబెట్టడాన్ని ఆయనవద్ద ప్రస్తావించగా అర్ధరాత్రి జీవోలు జారీ చేయలేదన్నారు. ఏ జీవో కూడా సంవత్సరం ముందు చేయరని స్పష్టం చేశారు. ఏది సరైనదో కోర్టు తేల్చనుందని తెలిపారు.

*చిత్రం... విలేఖరుల మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ, పక్కన ఎమ్మెల్యేలు కోలగట్ల, అప్పలనర్సయ్య