ఆంధ్రప్రదేశ్‌

అమల్లోకి ఎన్నికల కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ఘట్టం ముగిసే వరకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిగా నిలుపుదల చేయిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. శనివారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఎంపీటీసీ, జెడ్పీడీసీ ఎన్నికలు సందర్భంగా పోలింగ్ జరిగే 21వ తేదీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులకు ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం, 1988 ప్రకారం అలాగే నెగోషియబుల్ ఇస్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం స్థానిక సెలవుదినంగా ప్రకటించామన్నారు. అలాగే పోలింగ్ జరిగే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థల భవనాలు, ఇతర భవనాలకు 20, 21 తేదీల్లో సెలవుదినంగా ప్రకటించామన్నారు. 19వ తేదీ సాయంత్రం ప్రచారం ముగిసినప్పటి నుంచి 21వ తేదీ పోలింగ్ ముగిసే వరకు 48 గంటల పాటు సంబంధిత పోలింగ్ ప్రాంతాల్లో 1994 పీఆర్ చట్టానికి లోబడి మద్యం దుకాణాలను మూసివేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఇళ్ల స్థలాల పంపిణీని ప్రవర్తనా నియమావళి కింద అనుమతించలేమన్నారు. ఈ విషయంపై హైకోర్టులో ఇళ్ల స్థలాల పంపిణీని నిలువరించడానికి కొన్ని కేసులు దాఖలయ్యాయని రమేష్ కుమార్ గుర్తు చేశారు. అందుకే ఈ అంశాలన్నింటినీ గమనించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి టెండర్లను పిలువడం, టోకెన్ల పంపిణీ కార్యక్రమాలకు సంబంధించి కార్యకలాపాలు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు చేపట్టరాదని, లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల స్థలాల పంపిణీలకు సంబంధించిన పనులతో సంబంధం కలిగిన రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులు అందరూ పూర్తిగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కల్గి ఉండాలన్నారు. 13 జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, పరిశీలకులు మొత్తం ఈ ఆదేశాలను విధిగా పాటించాల్సి ఉందన్నారు.
ఎన్నికల కమిషన్ కార్యాలయంలో
ఐజీ కే సత్యనారాయణ బాధ్యతల స్వీకారం
స్థానిక ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసు శాఖలో సీనియర్ అధికారి ఐజీ కే సత్యనారాయణ శనివారం ఎన్నికల కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పోలీసు అధికారుల సమన్వయంతో రాష్ట్రంలోని శాంతిభద్రతలను సత్యనారాయణ సమీక్షిస్తారు.
*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్