ఆంధ్రప్రదేశ్‌

ఎవరెవరు వచ్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 14: రాష్ట్రంలో కరోనా మహమ్మారి నెమ్మదిగా విస్తరిస్తోంది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిపై అధికార యంత్రాంగం నిఘా పెట్టింది. కొవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారి వివరాలను నిశితంగా పరిశీలించి క్షేత్ర స్థాయిలో ఇళ్ల వద్దే వారికి వైద్య సేవలందించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కొందర్ని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. ప్రధానంగా చైనా, అమెరికా, జర్మనీ, ఇరాన్, ఇటలీ, అరబ్ దేశాల నుంచి వచ్చే వారిపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నారు. వీరితో పాటు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సైతం విదేశీ ప్రయాణికులపై కనే్నశారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినా కొందరు ప్రతిష్టకు పోయి తప్పించుకుంటున్నారని అధికారులు చెప్తున్నారు. వ్యాధి సోకిన తరువాత ఇబ్బందులు పడతారని ముందు జాగ్రత్తలు పాటిస్తే దూరం చేయవచ్చనేది అధికారుల వాదన. ఇదిలా ఉండగా ఇంటింట సర్వేకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిర్బంధ వైద్యపరీక్షలు నిర్వహించాలని కూడా భావిస్తోంది. నెల్లూరులో కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ కావటంతో పాటు విశాఖపట్నం విమానాశ్రయంలో ఇప్పటి వరకు 8691 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 64 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. విశాఖ, గంగవరం ఓడ రేవుల్లో మరో 1088 మందికి ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించగా ఏ ఒక్కరికీ వ్యాధి లక్షణాలు కనిపించలేదని వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కృష్ణపట్నం ఓడరేవులో కూడా 622 మందికి స్క్రీనింగ్ చేశారు. కొవిడ్-19 ప్రభావిత దేశాల నుండి వచ్చిన ప్రయాణికులు వ్యాధి లక్షణాలు
లేకపోయినా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లవద్దని కుటుంబ సభ్యులు, ఇతరులతో కరచాలనం చేయరాదని ఆంక్షలు విధించింది. ఓ వైపు విదేశీ ప్రయాణికులను కనిపెట్టి వారికి వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లతో పాటు మరోవైపు రాష్ట్రంలో ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుచేసి మాస్క్‌లు అందుబాటులో ఉంచుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్ ధరించి సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని జవహర్ రెడ్డి సూచించారు. 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలని కోరారు. కరోనా (కొవిడ్-19) వైరస్ నిరోధక చర్యలపై శనివారం ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలో కొవిడ్-19 సోకిన రోగి ప్రస్తుతానికి కోలుకుంటున్నాడని 14 రోజల తరువాత తిరిగి శాంపిల్‌ను పరీక్షించి ఆసుపత్రి నుంచి విడుదల చేస్తామని చెప్పారు. కరోనా పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలు దీనిపై అవగాహన పెంపొందించుకోవటమే పరిష్కారమన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. కొవిడ్-19 అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నెంబర్ 0866-2410978కు అందించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్-19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన 675 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారని, వీరిలో 428 మంది వారి ఇళ్లలోనే వైద్యులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. 233 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయిందన్నారు. మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. మొత్తం 61 మంది రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపగా 52 మందికి నెగటివ్ అని తేలిందని, మరో 8 మంది శాంపిళ్లకు సంబంధించిన వైద్య పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వదంతులు నమ్మవద్దని కోరారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
*చిత్రం... విశాఖ విమ్స్‌లో కరోనా ప్రత్యేక వార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్ వినయ్‌చంద్