ఆంధ్రప్రదేశ్‌

జోరుగా నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు, మునిసిపాల్టీల్లో నామినేషన్లు ఊపందుకున్నాయి. ప్రక్రియ ప్రారంభమై మూడు రోజులు గడిచినప్పటికీ శుక్ర, శని వారాల్లో రికార్డు స్థాయిలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక సంస్థల్లో మునిసిపాల్టీలు, కార్పొరేషన్లకు పార్టీపరంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మునిసిపల్, నగర పంచాయతీలకు ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్ల వివరాలను ఎన్నికల
సంఘం మీడియాకు విడుదల చేసింది. కార్పొరేషన్లలో వివిధ వార్డులకు శుక్రవారం ఒక్కరోజే 5027 నామినేషన్లు దాఖలు కాగా గత మూడు రోజుల్లో 6563 మంది నామినేషన్లు సమర్పించారు. పార్టీల వారీగా వైఎస్సార్ కాంగ్రెస్- 2307, టీడీపీ- 1675, బీజేపీ-345, బీఎస్పీ- 33, జనసేన-386, సీపీఐ-88, సీపీఎం-146, కాంగ్రెస్-290, ఎన్సీపీ-1, ఇతర పార్టీలు-62, స్వతంత్ర అభ్యర్థులు 1230 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా 75 మునిసిపాల్టీల్లో ఇప్పటి వరకు 12086 దాఖలు కాగా, శుక్రవారం ఒక్కరోజే 9837 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. పార్టీల వారీగా పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్- 5452, టీడీపీ-3610, జనసేన -434, బీజేపీ-554, బీఎస్పీ-27, సీపీఐ-104, సీపీఎం-110, కాంగ్రెస్-168, ఎన్సీపీ-87, ఇతర పార్టీలు-122, స్వతంత్ర అభ్యర్థులు 1418 మంది నామినేషన్లు వేశారు.