ఆంధ్రప్రదేశ్‌

అవినీతి రహిత సమాజం వైసీపీతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: అవినీతి రహిత సమాజ స్థాపన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్థాపించి 9సంవత్సరాలు పూర్తిచేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వార్షిక ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సజ్జల పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండే వైసీపీ ప్రయాణం ప్రారంభమైందని, ఉభయ రాష్ట్రాల్లోని వైఎస్‌ఆర్ అభిమానులు జగన్‌కు అండగా నిలిచారన్నారు. 2009లో మహానేత వైఎస్‌ఆర్ మరణం తర్వాత వందలాది గుండెలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ మరణం తర్వాత జగన్ ఒంటరి పోరాటం చేశారని, ఎన్నో లక్షల మంది ఆయనతో కలిసి నడిచారన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సానుకూలమైన ఓటుతో వైఎస్ జగన్ ప్రజల ఆదరణతో 51శాతం ఓట్లు సాధించారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో వదిలివెళ్లినా జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. చిన్నగొడవలను కూడా టీడీపీ నేత చంద్రబాబు భూతద్దంలో చూపిస్తున్నారన్నారు. మాచర్లలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో విజయవాడ నుండి బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న అక్కడికి ఏం పనిమీద వెళ్లారని, గురజాలలో టీడీపీ హీరో యరపతినేని ఉన్నారుకదా అని ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే డ్రామాలు ఆడేందుకు వెళ్లారన్నది స్పష్టమవుతోందన్నారు. వేరే ప్రాంతంలోకి వెళ్లి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, రెండువర్గాల మధ్య గొడవలో టీడీపీ నేతలు వెళ్లి దాన్ని పెద్దది చేశారని ధ్వజమెత్తారు. గతంలో వైసీపీ నాయకులను టీడీపీ కార్యకర్తలు వెంబడించి దాడులు చేశారని, సత్తెనపల్లిలో ముస్త్ఫా, అంబటి రాంబాబుపై గతంలో దౌర్జన్యాలు చేశారని, అవి టీడీపీ నేతలు మర్చినట్లున్నారన్నారు. పార్టీ నాయకులు ఎన్ లక్ష్మీపార్వతి, ఉండవల్లి శ్రీదేవి, ఏవీఎస్ నాగిరెడ్డి, చల్లా మధుసూదనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న సజ్జల, లక్ష్మీపార్వతి తదితరులు