ఆంధ్రప్రదేశ్‌

కర్నూలులో కరోనా అనుమానిత కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 12: కర్నూలులో కరోనా వైరస్ అనుమానిత కేసు నమోదైంది. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్న 66 ఏళ్ల వృద్ధురాలిని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోగి రక్త నమూనాలను సేకరించి నిర్ధారణ కోసం పూణేకు పంపినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. వృద్ధురాలు ఇటీవల జోర్డాన్ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమె ఉంటున్న ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారిని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదుకావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం వ్యాధి పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చింది.