ఆంధ్రప్రదేశ్‌

ఆవిరవుతున్న గోదారి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 4: వేసవికి ముందే గోదావరి నదీ జలాలు ఆవిరవుతున్నాయి. ఎక్కడికక్కడ తేలుతున్న ఇసుక దిబ్బలతో గోదావరి నది శుష్కించిన దేహంలా కన్పిస్తోంది. గత వారం రోజులుగా పరీవాహక ప్రాంతంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వేగంగా గోదావరి నదిలో నీటి లభ్యత క్షీణిస్తోంది. దీంతో రబీ 2019-2020కి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నీటి లభ్యత కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. రబీని గట్టెక్కించడానికి జలవనరుల శాఖ యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం సీలేరు నుంచి అదనపు జలాలు తీసుకుంటే తప్ప రబీ అవసరాలను అధిగమించే పరిస్థితిలేదనే అంచనాతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం సీలేరు నుంచి ఇటు జనరేషన్, అటు సాధారణంగా విడుదలచేసే జలాలు వెరసి రోజుకు 5500 క్యూసెక్కులు గోదావరి నదిలో కలుస్తున్నాయి. గోదావరి నది సహజ నీటిని, సీలేరు జలాలను కలిపి మూడు డెల్టాలకు విడుదలచేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి వద్ద బుధవారం 12.53 మీటర్ల నీటి మట్టం నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి బ్యారేజి వద్ద 13.35 మీటర్ల నీటి మట్టం నమోదైంది. దీనికి తోడు గత ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వర్షాలు కూడా కురిశాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల బ్యారేజికి ఎగువ ప్రాంతంలో గోదావరి జలాలు భారీ పైపుల నుంచి పారుతున్నాయి. దీని వల్ల కూడా ఆవిరి శాతం పెరిగిందని సమాచారం. సీలేరు నుంచి వచ్చే జలాలు బ్యారేజి వద్దకు వచ్చే సరికి ఆలస్యం అవుతుండటంతో ఆవిరి పెరిగింది. వాస్తవానికి రబీ 2019-2020కు 92 టీఎంసీల (వ్యవసాయ, తాగునీటి అసవరాలతో కలిపి) జలాలతో కార్యాచరణ రూపొందించారు. ఇప్పటివరకు 71 టీఎంసీల జలాలను డెల్టా కాలువలకు వినియోగించారు. ఇంకా 21 టీఎంసీలు అవసరంవుంది. ఇందులో కేవలం 11 టీఎంసీలు మాత్రమే సీలేరు నుంచి రావాల్సివుంది. మిగిలిన 10 టీఎంసీలు గోదావరి నదిలో సహజంగా లభించే పరిస్థితి కనిపించకపోవడంతో అధికారులు రబీని గట్టెంచాలంటే సీలేరు నుంచి అదనపు జలాలు కావాల్సిందేనని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుత డెల్టా అవసరాల రీత్యా సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి నుంచి గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాల సాగునీటి కాల్వల ద్వారా 7460 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. గత ఏడాది ఇదే కాలంలో మూడు డెల్టాలకు 8500 క్యూసెక్కులు సరఫరా చేశారు.