ఆంధ్రప్రదేశ్‌

మోదీ పథకాల లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీలే అధికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 26: పౌరసత్వ సవరణ చట్టం వల్లన ఎవరికి నష్టమో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించాలని, అప్పుడు తాము రాజకీయాల నుండి తప్పుకుంటామని, లేకుంటే ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా అని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పేర్కొన్నారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ మోర్చాల ఆధ్వర్యాన గుంటూరు నగరంలోని గుంటూరు కనె్వన్షన్ సెంటర్‌లో బుధవారం పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన మురళీధరరావు మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలులో అంకితభావంతో ఉన్నది బీజేపీయేనన్నారు.
జన్‌ధన్ పథకం నుండి ముద్ర పథకాల వరకు, ఉజ్వల పథకం నుండి హౌసింగ్ వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేసిన పథకాల్లో 70 శాతానికిపైగా లబ్ధిదారులు దళిత, గిరిజనులేనన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో గ్రామీణ, వ్యవసాయ అభివృద్ధికి రూ.2.08 లక్షల కోట్లు కేటాయించారన్నారు. రూ. 15 లక్షల కోట్ల విలువైన రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు ప్రధానమంత్రి ఆదేశించారన్నారు. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశ పర్యటనకు వస్తే దేశ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఆలోచనతో సీఎఎను వ్యతిరేకించే మతతత్వ వాదులు, ప్రతిపక్ష వాదులు ఢిల్లీలో విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. దేశంలోని పేదలను ఏ మతం అని అడిగి సంక్షేమ పథకాలను తాము అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేయకుండా 24 గంటలూ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రతిపక్షాలది అసత్య ప్రచారం: కన్నా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్రమోదీని ఎదుర్కొనే సత్తా లేక ప్రతిపక్షాలు సీఏఏపై అసత్య ప్రచారం చేస్తూ ముస్లిం సోదరులను రెచ్చగొడుతున్నారన్నారు. ఈ సదస్సులో ఏపి ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్కా సునీల్, జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి సతీష్‌జీ, రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోదార్, శాసనమండలి సభ్యులు మాధవ్, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, మైనార్టీ మోర్చ జాతీయ కార్యదర్శి షేక్ బాజి, పాతూరి నాగభూషణం, ఎస్సీ, ఎస్టీ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
*చిత్రం... సభలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు