ఆంధ్రప్రదేశ్‌

ప్రకృతి విపత్తులను గుర్తించే సాంకేతికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. ఇక్కడి కుంచనపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్థ కేంద్ర కార్యాలయంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నూతన ఆవిష్కరణలను చేపట్టామన్నారు. ఇందులో భాగంగానే ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. గతంలో తుపాన్లు, వరదలు, పిడుగుల వంటి వాటిని ముందుగా గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారని, దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగేదని గుర్తు చేశారు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజానం ద్వారా అతి భారీ వర్షాలను, ఉప్పెనలను, తదితర ప్రకృతి వైపరీత్యాలను ముందుగా గుర్తించేందుకు వీలు అవుతోందన్నారు. ముందుగా తెలుసుకున్న సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు, తద్వారా వారిని అప్రమత్తం చేసేందుకు వీలు కలుగుతోందన్నారు. మొబైల్ వ్యవస్థ ద్వారా జారీ చేసే హెచ్చరికలను ఆయా వ్యక్తులు చూసే వరకూ హెచ్చరికలను జారీ చేసేలా ఈ విధానాన్ని తీర్చిదిద్దామన్నారు. ఇటీవల ఒడిశాలో సంభవించిన ప్రకృతి విపత్తు సమయంలో హెచ్చరికల వ్యవస్థ ద్వారా కొద్ది సమయంలోనే 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారన్నారు. దేశంలో ఈ తరహా వ్యవస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. ఈ విధానం ద్వారా ఒకేసారి 75 లక్షల మందికి ముందస్తు హెచ్చరికలను జారీ చేయవచ్చని వెల్లడించారు. విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కింద రౌటర్లు, సర్వర్లు, డిజిటల్ మొబైల్ రేడియో, శాటిలైట్ టెర్మినల్స్, ఎలక్ట్రానిక్ సైరన్ల వంటివి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 250 కిలోమీటర్ల వేగంగా వీచే గాలులను తట్టుకునేలా ఈ ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ల తీవ్ర తుపానుల సమయంలోనూ ముందస్తు ప్రమాద హెచ్చరిక జారీ వ్యవస్థ పని చేస్తుందన్నారు. ప్రకృతి విపత్తుల సమర్థ నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు మాట్లాడుతూ 87 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 9 సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో రెండేసి చొప్పున, రాష్ట్ర కార్యాలయాల్లో రెండు డిజిటల్ మొబైల్ రేడియో సిస్టమ్‌లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 145 గ్రామాల్లో సైరన్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

*చిత్రం... ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ప్రారంభిస్తున్న మంత్రి సుచరిత