ఆంధ్రప్రదేశ్‌

గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 26: తరతరాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ ఎటువంటి అభివృద్ధికి నోచుకోని రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని మాజీ ఎంపి గంగుల ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుండి కూడా ఎక్కువ మంది ముఖ్యమంత్రులను అందించిన ప్రాంతమైన రాయలసీమలో అభివృద్ధి మాత్రం అథమస్థాయిలో ఉందన్నారు. ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడినా, ఎందరు ముఖ్యమంత్రులు మారినా రాయలసీమ పరిస్థితి మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ వెనకబాటుతనాన్ని గమనిస్తూ వస్తున్న పరిణతి చెందిన రాజకీయ నాయకులు, మేధావులు పార్టీలకతీతంగా గ్రేటర్ రాయలసీమ కోసం తమ అనుభవాలను పంచుకుంటూ ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాంతంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే వీటన్నింటిని సద్వినియోగం చేసుకొని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదిగేందుకు ఎంతో సమయం పట్టదని స్పష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమ కోసం తాము చేస్తున్న పోరాటానికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.