ఆంధ్రప్రదేశ్‌

వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం నగరంలోని పోలీస్ బ్యారెక్స్‌లో నూతనంగా నిర్మించిన దిశ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చినా గ్రామాన్ని దాటకుండానే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సుతోపాటు మరో ఏఎన్‌ఎంను నియమించి అదే గ్రామంలో 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల పేరును ఇక నుంచి గ్రామ మహిళా సంరక్షణ పోలీసుగా మార్పు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. గ్రామంలో అసాంఘీక కార్యకలాపాలను నిరోధించాలన్నారు. గ్రామ సచివాలయాల వ్యవస్థతో గ్రామ స్వరాజ్యానికి
శ్రీకారం చుట్టామన్నారు. గ్రామంలోనే అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. గ్రామానికి మంచి జరిగేలాపనిచేయాలన్నారు.గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను, పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన పథకాన్ని, బాత్‌రూంల పరిశీలన గ్రామ సచివాలయ పరిధిలోకి తీసుకువస్తామన్నారు. ప్రతి 2వేల జనాభా గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఆ గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, హోంశాఖ మంత్రి సుచరిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, టి.వనిత, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, గొట్టేటి మాధవి, ఎంవివి సత్యనారాయణ, కలెక్టర్ హరి జవహర్‌లాల్, డిజిపి గౌతమ్ నవాంగ్, సీపీ ఆర్పీ మీనా, డీఐజీ పాలరాజు, ఎస్పీ రాజకుమారి, ఒఎస్‌డి శ్రీ్ధర్‌రెడ్డి, దిశ ప్రత్యేక అధికారులు కృతిక శుక్లా, ఎం దీపికా పాటిల్, ఎఎస్పీ శ్రీదేవి రావు, ఒఎస్‌డి రామ్మోహనరావు, ఎఎస్పీ సుమిత్ గరుఢ్, గౌతమి శాలి, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం...దిశ పోలీసు స్టేషన్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి