ఆంధ్రప్రదేశ్‌

ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము.. చదువుల విప్లవం తీసుకువచ్చేందుకు మూడు వినూత్న పథకాలను ప్రవేశ పెట్టాము... పిల్లలకు నేనిచ్చే ఆస్తి చదువు ఒక్కటే.. పిల్లల తలరాతలు మారాలంటే వారు ఉన్నత స్థాయికి ఎదగాలి.. అందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాము.. ఏ ఒక్కరూ చదువును మధ్యలో నిలిపివేయరాదన్నదే నా ఆశయం.. అందుకోసం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము.. సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు రాష్ట్రంలో
మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంటే దాడులు చేస్తున్న మూకల్ని ఏమనాలి? ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేస్తున్న వారిని ఏమనాలి? అది ప్రతిపక్షం కాదు.. ఉన్మాదులు.. అందుకే ప్రతి రోజూ నేను ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నా... నన్ను ఆశీర్వదించండి అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కోరారు. సోమవారం స్థానిక అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ‘జగనన్న వసతి దీవెన’ అనే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా ఇంకా ఎందరో పేదరికంలోనే మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో పిల్లలు గొప్ప చదువులు చదివి ఉన్నత స్ధాయికి ఎదగాలని అలాంటపుడే వారి తలరాత మారుతుందని అన్నారు. రాష్ట్రంలో చదువుకోడానికి స్తోమత లేక ఏ ఒక్కరూ చదువును మధ్యలో మానివేయకుండా ఉండేందుకు చదువుల విప్లవం తీసుకువచ్చామన్నారు. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన వంటి పథకాలను ప్రారంభించామని వివరించారు. ఈ మూడు పథకాలకు ఏటా రూ.12400 కోట్లు ఖర్చు చేయనున్నామని స్పష్టం చేశారు. మరోపక్క ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో వాటి రూపురేఖలు మార్చబోతున్నామన్నారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో 45వేల పాఠశాలలు, 471 జూనియర్ కళాశాలలు, 3287 వసతి గృహాలు, 188 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల రూపు రేఖలు మార్చబోతున్నామని వివరించారు. ఇందుకోసం దాదాపు రూ.13వేల కోట్లు ఖర్చు కానుందని అంచనా వేశామన్నారు. రానున్న కాలంలో విద్యార్థులు బ్రిక్స్ దేశాల స్థాయి విద్యార్థులతో పోటీపడేందుకు అనుకూలమైన వాతావరణాన్ని తీసుకువస్తున్నామన్నారు. అనంతరం ఆయన పోలీస్ బారెక్స్‌లో నూతనంగా నిర్మించిన దిశ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, హోంశాఖ మంత్రి సుచరిత, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి విశ్వరూప్, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి ఎం.శంకరనారాయణలు ప్రసంగించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, స్ర్తి శిశుసంక్షేమశాఖ మంత్రి టి.వనిత, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, ఎంవివి సత్యనారాయణ, జి.మాధవి, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, రాజన్నదొర, అప్పలనర్సయ్య, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, అలజంగి జోగారావు, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కడుబండి శ్రీనివాసరావు, కళావతి, మాజీ ఎంపీ ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు.

*చిత్రాలు.. బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్, హాజరైన విద్యార్థులు