ఆంధ్రప్రదేశ్‌

తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా బాబు వ్యవహారశైలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 20: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు తాగుబోతుల సంఘం అధ్యక్షుడి మాదిరిగా ఉన్నాయని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణరెడ్డి విమర్శించారు. గురువారం గుంటూరులోని సిమ్స్ కళాశాలలో విద్యార్థులకు మద్యం వలన కలిగే దుష్ఫలితాలను వివరించేందుకు జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేయాలని కృషి చేస్తుంటే స్వాగతించాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇప్పటికీ 20 శాతానికి పైగా మద్యం వినియోగాన్ని తగ్గించారని, 800 మద్యం షాపులను తొలగించి ప్రభుత్వ మద్యం షాపులను ప్రారంభించడంతో పాటు విచ్చలవిడి అమ్మకాలను నియంత్రించిందన్నారు. అంతేకాకుండా మద్యం వలన కలిగే దుష్ఫలితాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు మద్య విమోచన ప్రచార కమిటీని కూడా ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రప్రభుత్వం త్రికరణశుద్దిగా కృషిచేస్తుంటే బాబు మద్యం ధరలు తగ్గించి, మద్యం వినియోగాన్ని పెంచి ప్రజలను తాగుబోతులుగా మార్చడం మంచిదన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు.