ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ వినియోగంలో అంతర్జాతీయ సాంకేతికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ సాంకేతికతను అందించేందుకు కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ముందుకు వచ్చింది. ఐఎస్‌ఓ 50001:2008 ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌గా పిలిచే ఆధునిక విధానాలు అవలంబించడం ద్వారా భారీ స్థాయిలో అనవసరంగా విద్యుత్ వినియోగాన్ని నివారించడం సహా ఇంధన సామర్థ్యం మెరుగు పరిచి.. తద్వారా నిర్వహణ వ్యయాన్ని తగ్గించవచ్చు. అంతిమంగా ఇది పారిశ్రామిక రంగ ప్రగతికి, సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుంది. ఐఎస్‌ఓ 50001:2008 ఎనర్జీ మేనేజ్‌మెంట్ ప్రమాణాలపై విశాఖలో బుధవారం దక్షిణాది రాష్ట్రాల వర్కుషాపును బీఈఈ నిర్వహించింది. ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఈఈ డైరెక్టర్ సునీల్ ఖండరే మాట్లాడుతూ విద్యుత్ రంగంలో కీలక లక్ష్యాల సాధనకు, పారిశ్రామిక రంగంలో పురోగతికి ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఎనర్జీ మేనేజ్‌మెంట్ విధానం అమలు ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ విధానం అమలు ద్వారా పరిశ్రమల్లో వృథా వినియోగాన్ని తగ్గించడం, ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో ఇంధన పొదుపును పెంచడం, నిర్వహణా వ్యయాన్ని భారీగా తగ్గించడం, నాణ్యతను, ఉత్పాదకతను మెరుగుపరచడం, పరిశ్రమలను
పర్యావరణహితంగా తీర్చిదిద్దడం వంటి లక్ష్యాలను సాధించవచ్చన్నారు. ఏపీఈఆర్సీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగం 59,162 మిలియన్ యూనిట్లు కాగా, అందులో 20,026 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పారిశ్రామిక రంగంలో జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఎనర్జీ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్ అమలు వల్ల పారిశ్రామిక రంగం సహా రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతుందన్నారు.
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2040 నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్‌లో 25 శాతం కేవలం భారత్‌లోనే ఉంటుందని, దేశంలో మొత్తం కర్బన ఉద్ఘారాల్లో ఇంధన రంగం నుంచే 75 శాతం వరకూ ఉంటుందని అంచనా వేసిందన్నారు. పారిశ్రామిక రంగంలో ప్రస్తుతం ఉన్న 347 మిలియన్స్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ (ఎంటీఓఈ)ల ఇంధన వినియోగం 2031 నాటికి 443.4కు చేరుకుంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని 2030 నాటికి 165 ఎంటీఓఈల విద్యుత్ ఆదా చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ పొదుపు విలువ 1.8 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. దీనిని సాధించేందుకు ఐఎస్‌ఓ 50001:2008 ఎనర్జీ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్ దోహదపడతాయన్నారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సందేశాన్ని రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏ.చంద్రశేఖర రెడ్డి చదివి వినిపించారు. రాష్ట్రంలో నిరంతర ప్రాతిపదికన చౌకగా విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అవసరాలకు సరిపడా నాణ్యమైన విద్యుత్‌ను చౌకగా అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రతిపాదనను విద్యుత్ సంస్థల ముందు ఉంచామన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో 500 కోట్ల రూపాయలు, బొగ్గు సరఫరా టెండర్లలో 180 కోట్ల రూపాయలను ఇప్పటికే విద్యుత్ సంస్థలు ఆదా చేశాయని గుర్తు చేశారు. పరిశ్రమలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాకు వీలుగా వౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ఆన్‌లైన్ పర్యవేక్షణా వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. రాష్ట్రంలో 14,494 మిలియన్ యూనిట్ల మేర ఆదా చేసే అవకాశం ఉన్నందున తమకు సహకరించాలని బీఈఈని కోరారు. నేషనల్ బోర్డు ఆఫ్ క్వాలిటీ ప్రమోషన్ ముఖ్య సలహాదారు అవిక్ మిత్ర మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఎరువులు, సిమెంట్, స్టీల్ పరిశ్రమలను ఈ ఎనర్జీ స్టాండర్డ్స్ పరిధిలోకి వచ్చేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఏపీలో కూడా దీనిని అమలు చేస్తామన్నారు. ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) బి.రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు ఇప్పటికే 85 సబ్‌స్టేషన్లను, 3445.68 కిలోమీటర్ల మేర 33/11 కేవీ లైన్లను ఏర్పాటు చేశామన్నారు.