ఆంధ్రప్రదేశ్‌

ధర్నాలు, దీక్షలతో నాటకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 27: రాజధాని అమరావతి పరిరక్షణ అంటూ పెయిడ్ ఆర్టిస్టులను దించిన చంద్రబాబు నానాయాగీ చేస్తున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. వారితోనే దీక్షలు, ధర్నాలు, ఆందోళనలను చేయిస్తున్న చంద్రబాబు చివరకు జోలె పెట్టి చందాలు పెద్ద ఎత్తున పోగు చేశారని సోమవారం ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. ఇప్పుడవన్నీ వదిలేసి కౌన్సిల్‌ను ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ రంకెలేశారని గుర్తు చేశారు. చిట్టినాయుడు, వెన్నుపోటు సహచరుడు నిరుద్యోగులవుతారని
బాబుకు భయం పట్టుకుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నారు.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బు ముట్టచెబుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీలు ఎక్కడ ధిక్కరిస్తారో అని చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు. వారి పదవీకాలం ముగిసేంత వరకు జీత భత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తానని మాట ఇస్తున్నారన్నారు. చంద్రబాబు కష్టాలు ఆయన అనుకూల మీడియాకు జీవన్మరణ సమస్యగా పరిణమించాయని విమర్శించారు. శాసనమండలి రద్దుపై సీఎం జగన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్సీల కదలికలపై కుల మీడియా పూర్తి స్థాయిలో నిఘా పెట్టిందన్నారు. వారి ఇళ్ల చుట్టూ తమ ప్రతినిధులను మోహరించి బాబుకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందని ఆరోపించారు. సీఎం జగన్ విలువలకు కట్టుబడిన మొండి మనిషి కాబట్టి సరిపోయిందని, ఆయన గనుక పార్టీ గేట్లు తెరిచి ఉంటే ఈ పాటికి అంతా జంప్ అయ్యేవాళ్లని పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
*చిత్రం... వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి