ఆంధ్రప్రదేశ్‌

తెలుగు సాహితీ రంగానికి సంపద వేమన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 19: తెలుగు సాహితీ రంగానికి వేమన పద్యాలు గొప్ప సంపద అని గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్‌కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు కోటలో ఆదివారం ప్రజాకవి యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వేమన ఆటవెలది పద్యాల రూపంలో సామాన్యులకు అర్థమయ్యే భాషలో అద్భుత కవిత్వం అందించారన్నారు. పద్యాల ద్వారా సామాజిక రుగ్మతలపై అక్షర బాణాలను సంధించారన్నారు. కొండవీడు కోటను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనుందని ఈసందర్భంగా కలెక్టర్ వివరించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం వేమన జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి మాట్లాడుతూ వేమనపై ఎంతోమంది పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించారన్నారు. వేమన పద్యాలను ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వేమనపై వచ్చిన పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీ బాలభారతి వ్యవస్థాపకులు యర్రం సాంబిరెడ్డి, రాష్ట్ర మద్య విమోచన కమిటీ చైర్మన్ వీ లక్ష్మణరెడ్డి, యోగి వేమన ట్రస్ట్ కార్యదర్శి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం... వేమన పుస్తకం ప్రతులను ఆవిష్కరిస్తున్న కలెక్టర్