ఆంధ్రప్రదేశ్‌

జోలెతో బాబు కొత్త డ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 14: ఓటుకు నోటు కేసు భయంతోనే హైదరాబాద్ నుండి చంద్రబాబు నాడు పారిపోయి అమరావతికి చేరుకున్నారని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ విమర్శించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను మోసగించిన చంద్రబాబు నేడు ఊరూరా తిరుగుతూ జోలె పట్టుకుని మరో డ్రామాకు తెర తీశారన్నారు. అధికార వికేంద్రీకరణను రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తుంటే టీడీపీ, చంద్రబాబు బినామీలే ఆందోళన చేస్తున్నారన్నారు. భోగిమంటల్లో తగులబెట్టాల్సింది చంద్రబాబు అక్రమాలకు సంబంధించిన పత్రాలు, హెరిటేజ్‌ను ఫ్యూచర్ గ్రూప్‌కు విక్రయించిన డాక్యుమెంట్లను అని ధ్వజమెత్తారు. తగులబెట్టే సంస్కృతికి శ్రీకారం చుట్టింది చంద్రబాబేనన్నారు. టీడీపీ అక్రమాలు, అరాచకాలకు స్వస్తి చెప్పేందుకే ప్రజలు వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. రాజధాని ప్రాంతంలో ముందుగానే బినామీలు, ఎమ్మెల్యేలతో భూములు కొనుగోలు చేయించి తరువాతే అక్కడ రాజధానిని ప్రకటించారన్నారు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కొని వారు స్వచ్ఛందగా ఇచ్చినట్లు బాబు ప్రచారం చేశారన్నారు. రాజధాని ప్రాంతంలోని 29గ్రామాల్లో చంద్రబాబు అనుచరులే ఉద్యమాలు చేస్తున్నారుతప్ప రైతులుకాదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 7 దశాబ్దాల కాలంలో 88వేల కోట్ల రూపాయలు అప్పులైతే చంద్రబాబు హయాంలో 3లక్షల కోట్లకు రాష్ట్ర అప్పులు చేరుకున్నాయన్నారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. చెన్నై ఐఐటీ నిపుణులు కూడా రాజధాని ముంపు ప్రాంతమని చెప్పినా చంద్రబాబు ఎందుకు ఈప్రాంతంలో ఏర్పాటు చేశారని ఆమంచి నిలదీశారు.