ఆంధ్రప్రదేశ్‌

ఆన్‌లైన్‌లోనే ప్రవేశ పరీక్షలు నేడు కీలక నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షలన్నీ ఇక మీదట ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు సన్నద్ధంగా వివిధ ప్రవేశ పరీక్షల నిపుణుల కమిటీలతో ప్రభుత్వం శుక్రవారం నాడు సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను అధ్యయనం చేస్తారు. ఈ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి తదుపరి చర్యలను చేపడుతుంది. సెట్ల షెడ్యూలును ప్రతి ఏటా సహజంగా డిసెంబర్‌లో ప్రకటించాల్సి ఉంటుంది. షెడ్యూలు ప్రకటించడానికి ముందే ఆన్‌లైన్ ఏర్పాట్లు చేస్తే మంచిదని ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పబ్లిక్ సర్వీసు కమిషన్ విజయవంతంగా ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తోంది. అదే విధంగా నీట్, ఐఐటి జెఇఇ పరీక్షలు ఆన్‌లైన్‌లో విజయవంతగా నిర్వహిస్తుండగా, అంతర్జాతీయ పరీక్షలు ఎసిటి, టోఫెల్, ఐఇఎల్‌టిఎస్ తదితర పరీక్షలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లింపు, హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి అన్ని ప్రక్రియలను ఇపుడు ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. అలాగే అడ్మిషన్ల సమయంలో ఆన్‌లైన్‌లోనే వెబ్ ఆప్షన్లను ఇవ్వడం, సీట్ల కేటాయింపు సహా పలు ప్రక్రియలను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని సెట్లనూ ఆన్‌లైన్‌లోనే చేయాలా లేదా ప్రయోగాత్మకంగా కొన్ని సెట్లను ఆన్‌లైన్‌లో నిర్వహించాలా అనేది ఈ సమావేశంలో తేలిపోతుంది. ప్రస్తుతం ఎమ్సెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లా సెట్, పిజి లాసెట్, పిఇసెట్, పిజి సెట్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీటితో పాటు మిగిలిన అనుబంధ పరీక్షలు డైట్‌సెట్, పాలిసెట్ కూడా నిర్వహిస్తున్నారు.