ఆంధ్రప్రదేశ్‌

గిరిజన ప్రాంతాలకు తరలండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లో ఏజన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం సమీక్ష నిర్వహించారు. గురువారం రాష్ట్రంలోని మంత్రులు ఆయా జిలాల్లో విషజ్వరాలపై సమీక్షించనున్నారు. వైద్య ఆరోగ్య మంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రితో పాటు వైద్య బృందాలను గిరిజన ప్రాంతాలకు తరలి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంచార వైద్య వాహనాలను విషజ్వరాలు ప్రబలిన ప్రాంతాలకు పంపాలని అన్నారు. అవసరమైతే మిగిలిన జిల్లాల్లో వైద్య బృందాలను కూడా ఆప్రాంతాలకు పంపిస్తారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధుల వల్ల ప్రాణహాని జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలో కూడా అధికారులకు సూచించారు. మరో పక్క ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనమ్ మాలకొండయ్య హైదరాబాద్ నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఏజన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులపై సమగ్ర విచారణ జరిపేందుకు ఐదు బృందాలను నియమించారు. ఏజన్సీ ప్రాంతాల్లో 24 గంటలూ సంచార వైద్య సేవలు అందుబాటులో ఉండేలా జిల్లా వైద్య అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా ఎఎన్‌ఎం, ఆశావర్కర్లు ద్వారా సీజనల్ వ్యాధులపై ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. సెలవులో ఉన్న వైద్యులు వెంటనే విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన రోగులకు డెంగ్యూ అని నిర్ధారిస్తే ప్లేట్లెట్స్ కూడా ఉచితంగా ఇచ్చేందుకు అన్ని బ్లడ్ బ్యాంకులతో మాట్లాడాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు.
5000 మంది సిబ్బందితో మొబైల్ మలేరియా, డెంగ్యూ యూనిట్లను ఈ నెల 19 నుండి ప్రారంభిస్తారు. వీటి కోసం కొత్తగా మరో 200 వాహనాలను ఏర్పాటు చేస్తారు. ఈ వాహనాల్లో మందులతో పాటు కిట్స్, ప్రచార కరపత్రాలు ఉంచుతారు. మరో పక్క వైద్య ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ గురువారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.