ఆంధ్రప్రదేశ్‌

మోహన్‌బాబుకు నవరస నటతిలకం బిరుదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: సినీ నటుడు ఎం.మోహన్‌బాబు సినీ నట జీవితంలో 40 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నవరస నట తిలకం బిరుదుతో సత్కరిస్తున్నట్టు రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంలో ప్రతి ఏడాది కళాకారులకు సత్కరించే సంప్రదాయం ఉందన్నారు. ఈసారి మోహన్‌బాబుకు ఈ బిరుదుతోపాటు ఘనంగా సత్కరిస్తామన్నారు. ఈ నెల 17న బిరుదు ప్రదానం చేస్తామన్నారు. ఆ రోజు కార్యక్రమానికి 40 మంది సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు హాజరవుతారన్నారు. చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్, మంచు విష్ణు, బోనీకపూర్, రవిరాజా, దాసరి నారాయణరావు, అల్లు అర్జున్, సురేశ్‌బాబు, ఏసుదాసు, మనోజ్‌కుమార్, డైరెక్టర్లు రాఘవేంద్రరావు, బి.గోపాల్, పరుచూరి గోపాలకృష్ణ, సునీల్‌వర్మ, రాజ తరుణ్, మ్యూజిక్ డైరెక్టర్లు మణిశర్మ, కోటి, ఎంఎం కీరవాణి, కె.బ్రహ్మనందం, ఆలీ, రాజ రవీంద్ర, పోసాని కృష్ణమురళీ, రాణా, అల్లు శిరీష్, నిఖిల్, సాయిధర్మతేజ, కల్యాణరామ్, నితిన్, వందేమాతరం శ్రీనివాస్, వై.రఘుబాబు, జయప్రద, జయసుధ, హన్సిక, ప్రణీత, రెజీనా, రకుల్ ప్రీత్‌సింగ్, కాజల్ అగర్వాల్, ఛార్మి, ఝాన్సీలక్ష్మీ, ప్రజ్ఞా జైస్వాల్, ఎం.లక్ష్మీ పాల్గొంటారన్నారు. ఈనెల 16న కళాభారతి ఆడిటోరియంలో ప్రముఖ సంఘ సేవకులకు ఘనంగా సత్కరిస్తామన్నారు. జవహర్‌బాల్‌భవన్ మాజీ డైరెక్టర్, బాలబంద్ డాక్టర్ ఎంకె రాము, సంఘ సేవకులు విజయ నిర్మాణ్ కంపెనీ అధినేత డాక్టర్ సూరపనేని విజయకుమార్, అన్నదాత మట్టపల్లి చలమయ్య, ఆగమ విశారధ, బ్రహ్మశ్రీ కృష్ణశర్మలకు సత్కరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామిజీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. అభినవ పతంజలి, అపర ధన్వంతరి పండిట్ శేషభత్తర్ సుదర్శనాచార్య, సినీ నటులు మోహన్‌బాబు, ముక్కామల క్షేత్రం శ్రీ యజ్ఞపురధీశ్వరి పరమపూజ్య శ్రీ్ధరస్వామిజీ, ప్రధాన జిల్లా కోర్టు జడ్జి వి.జయసూర్య గౌరవఅతిథులుగా పాల్గొంటారు. అనంతరం మోహన్‌బాబు మాట్లాడుతూ సినీ పరిశ్రమలో 40 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా తనను విశాఖలో జరిగే కార్యక్రమంలో సత్కరిస్తున్నట్టు సుబ్బరామిరెడ్డి చెప్పారన్నారు. అందువల్ల ఆరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.