ఆంధ్రప్రదేశ్‌

మరో 27స్మార్ట్ సిటీలు..నిర్ణయించిన కేంద్ర ం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: దేశంలో స్మార్ట్ సిటీల నిర్మాణం వేగవంతం చేస్తున్నామని, తొలి దశలో ప్రకటించిన స్మార్ట్‌సిటీలకు అనుబంధంగా కేంద్రం మరో 27 పట్టణాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న 3వ బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం సదస్సు ప్రారంభం సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌సిటీల అభివృద్ధిలో భాగంగా ఎంపికైన 33 పట్టణాల్లో రూ.78,292 కోట్లు, అటల్ మిషన్ కింద రూ.45,293 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద రూ.56,231 కోట్లు గృహనిర్మాణానికి మంజూరు చేశామన్నారు. గడచిన ఏడాది కాలంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కేంద్రం రూ.15,827 కోట్ల సాయం అందించిందన్నారు. రూ.10,579 కోట్లతో 1.9 లక్షల ఇళ్లను నిర్మించడంతో పాటు తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలకు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు.
స్మార్ట్‌సిటీల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి విధానం) అనివార్యమన్నారు. ఇప్పటికే 33 దేశ, విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. దీనికోసం 10 అంశాలను ప్రభుత్వం గుర్తించిందని, స్వచ్ఛ్భారత్ మిషన్, అమృత్, పిఎంఎవై తదితర పథకాల కింద ఇప్పటికే నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న పట్టణాలను మరింత సౌకర్యవంతంగా నిర్మించేందుకు స్మార్ట్‌సిటీ విధానాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. స్మార్ట్‌సిటీల ఎంపికలో ఎక్కడా రాజకీయ జోక్యానికి తావు లేదన్నారు. పట్టణాల మధ్య సౌకర్యాల కల్పనలో పోటీ విధానం ద్వారా ఎంపిక జరుగుతుందని, తద్వారా మిగిలిన పట్టణాలు కూడా స్మార్ట్‌సిటీలుగా రూపాంతరం చెందేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని అన్నారు. ప్రజలు సౌకర్యవంతమైన జీవనాన్ని కోరుకుంటున్నారని, దీనికోసం అదనంగా భారం పడినా ఆమోదించేందుకు సిద్ధం ఉన్నారన్నారు. అయితే స్థానిక సంస్థలు అందించే సేవల్లో నిజాయితీ, పారదర్శకత ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సుస్థిర అభివృద్ధికి స్థానిక సంస్థలు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.

బుధవారం విశాఖపట్నంలో ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపి సిఎం చంద్రబాబు, విదేశీ ప్రతినిధులు