ఆంధ్రప్రదేశ్‌

నేను నిత్య విద్యార్థిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: తాను నిత్య విద్యార్థినని, తనకు అన్నీ తెలుసునని భావించడం పతనావస్థకు ప్రారంభమని విద్యార్థులకు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో ఎయు సైన్సు కళాశాల దినోత్సవంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను అనునిత్యం విద్యార్థిగా వివిధ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు. అందుకే తాను అందరికంటే బెస్ట్ విద్యార్థినని చెప్పుకున్నారు. ప్రస్తుతం 4వ పారిశ్రామిక విప్లవం నడుస్తోందన్నారు. టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కలిసి ఒకప్పుడు సాధ్యం కావని భావించిన వాటిని సాధ్యం చేస్తున్నాయన్నారు. కృష్ణా పుష్కరాల్లో విద్యార్థులు సాంకేతిక పరిజానాన్ని వినియోగించి మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. అవకాశాలను సవాలుగా స్వీకరించారన్నారు. ఐఒటి వల్ల పాఠాలను ఎప్పుడు మూడ్ వస్తే, ఎక్కడ పడితే అక్కడ చదువుకునే వీలు ఉంటుందన్నారు. విద్యార్థులందరినీ తమ వద్ద ఉన్న సెల్ ఫోన్‌ల టార్చ్‌లైట్‌లను ఆన్ చేయమన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు టార్చ్‌లైట్ వేయడంతో అంతమంది ఒక్కసారి లైట్ వేయడం వల్ల ఈ హాల్‌లో వెలుగులు నింపాయన్నారు. భవిష్యత్తులో సెల్‌ఫోన్‌తోనే అన్ని పనులు జరుగుతాయని, సెల్‌ఫోన్‌లను సమర్ధవంతంగా వాడాలని, లేకుంటే సమస్యలు వస్తాయన్నారు. వర్సిటీల్లో మంచి వాతావరణం తీసుకురావాలని ఉత్తమ విలువలు కలిగిన వారిని వెతికి మరీ నామినేట్ చేస్తున్నానని, తమ పార్టీ కార్యకర్తలను నియమిస్తే అనుకున్న ఊపు రాదన్నారు. విద్యార్థులందరూ వారంలో ఒక రోజు గ్రామాల్లో లేదా పరిశ్రమలకు వెళ్లాలన్నారు. తరగతిలో నేర్చుకున్న అంశాలను అచరణలో తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. ఈ పని చేసినందుకు వెయిటేజ్ లేదా మార్కులు ఇచ్చే యోచన ఉందన్నారు. ఆలోచనపై ఆలోచించి కార్యాచరణ చేపట్టాలని, అపుడే విజయం సాధ్యమన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలని కోరుకున్నానని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చంద్రగిరిలో ముందునుంచే వివిధ గ్రామాల్లో పర్యటించానని తెలిపారు. సిఎంగా తనకు పోటీగా చేయాలనుకున్నా ఫరవాలేదని, ఈ వయసులోనే చేయగలమని భావించినవి చేయగలరన్నారు. విద్యార్థులు క్షేత్రస్థాయిలో చేపట్టే ప్రాజెక్టులకు మార్కులు ఇచ్చే యోచన ఉందన్నారు. తాను రోజు ఆరు కిలోమీటర్ల నడిచి వెళ్లి చదువుకునే వాడినని తెలిపారు. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేసే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.
కార్పొరేట్ విద్యను నిషేధించండి
ముఖ్యమంత్రితో జరిగిన ముఖాముఖిలో ఒక విద్యార్థి కార్పొరేట్ విద్యను నిషేధించాలని కోరారు. తాను ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే అనేక విషయాలు తెలుసుకోగలిగానన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఒకేసారి కార్పొరేట్ విద్యను నిషేధిస్తే కొత్త సమస్యలు వస్తాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ సంస్థల కన్నా దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ బాధ్యతను మంత్రి గంటా శ్రీనివాసరావుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

విశాఖలోని ఎయు సైన్సు కళాశాల దినోత్సవంలో
ప్రసంగిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు