ఆంధ్రప్రదేశ్‌

రక్షణ రంగానికి ఏపిలో అపార అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: రక్షణ రంగ పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎపిలో అపారమైన అవకాశాలున్నాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రక్షణ రంగ పరిశ్రమలు - ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం అంశంపై గత రెండు రోజులుగా విశాఖలో జరుగుతున్న ఇండో-రష్యా ద్వైపాక్షిచ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ, ఎయిరోస్పేస్, నౌకానిర్మాణం, సాంకేతిక సహకారాన్ని అందిపుచ్చుకునే అంశంలో భారత్, రష్యాలు ఎన్నోఏళ్లుగా మంచి సంబంధాలు కలిగి ఉన్నాయన్నారు.
ఈ బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగాలని, అందుకు వేదికగా ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ప్రతినిధులకు ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. అపారమైన సహజ వనరులు కలిగిన ఎపిలో పారిశ్రామికాభివృద్ధికి సహకారం అందించాలన్నారు. ఈజ్ ఫర్ డూయింగ్ బిజినెస్‌లో ప్రపంచంలోనే ఎపి రెండో స్థానంలో ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు అంచనాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. సువిశాల తీరప్రాంతం కలిగిన ఎపిలో నౌకానిర్మాణ రంగం రాణిస్తుందన్నారు. భారత నౌకాదళానికి తూర్పుతీరం రాజధానిగా భాసిల్లుతోందని, విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పుతీరంలో నౌకానిర్మాణ రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు నౌకాదళం ప్రధానాధికారి హెచ్‌సిఎస్ బిస్త్ మాట్లాడుతూ రక్షణ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. నౌకానిర్మాణంలో రష్యా ఎంతో అనుభవం కలిగి ఉందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలు పరిశీలించాలని కోరారు. దూరదృష్టి, విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని, పరిశ్రమల స్థాపనకు ఇదే మంచి అవకాశమన్నారు. సమావేశంలో రష్యా మోరిన్‌ఫార్మ్ సిస్టమ్ జనరల డైరెక్టర్ జియార్జీ అన్తసవ్, సుడో ఎక్స్‌పోర్ట్ యాక్టివిటీ డైరెక్టర్ బోరిస్ కోటవ్‌స్కీ, ఫిక్కీ చైర్మన్ జెడి పాటిల్, కో చైర్మన్ శివ్ కెమ్‌కా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.