ఆంధ్రప్రదేశ్‌

విశాఖకు రైల్వేజోన్ వచ్చి తీరుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి తీరుతుందని, విశాఖకు అన్యాయం జరిగే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హోదాకు మించిన ప్యాకేజీ ఇచ్చారని, అందుకే అంగీకరించానన్నారు. కావేరి జలాల కోసం బెంగళూరు ఖ్యాతిని పాడు చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల దినోత్సవం ఎయు కాన్వొకేషన్ హాల్‌లో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా సిఎం మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాలన్నారు. కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారని, కానీ విశాఖకు అన్యాయం చేసే ప్రశే్న లేదన్నారు. రైల్వే జోన్ తప్పకుండా వస్తుందన్నారు. తన పట్టు ఉడుం పట్టని, అనుకున్నవి నెరవేరే వరకూ వెనక్కు వెళ్లనని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వ్యవహారాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండటం అవసరమంటూ అప్పటి విభజన తీరును వివరించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుతో బాధపడ్డానని, అశాస్ర్తియంగా చేశారన్నారు. విభజన తరువాత కేంద్రంలో తమకు సాయం చేసే పార్టీ ఉండాలని భావించి బిజెపితో పొత్తు పెట్టుకున్నానని వివరించారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం తెలంగాణలోని ఏడు మండలాలను ఎపిలో వీలీనం చేసిందన్నారు. అత్యాధునిక యంత్రాలను వినియోగించి పోలవరం పనులను చేపడుతున్నామన్నారు. తాను ప్రతి సోమవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ పనులను పర్యవేక్షిస్తున్నానన్నారు. పోలవరం పనులు జరుగుతున్న తీరును ఇతర దేశాల్లోని వర్సిటీలు పరిశీలిస్తున్నాయని, రాష్ట్రంలోని వర్సిటీలు కూడా అధ్యయనం చేయాలని సూచించారు.
హోదా కన్నా మెరుగైన సాయం చేస్తామని కేంద్రం ముందుకు రావడం వల్లనే దాన్ని ఆమోదించామని బాబు చెప్పారు. పోలవరానికి 100 శాతం నిధులు ఇస్తామని కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. రెవెన్యూ లోటు భర్తీ చేస్తామన్నారన్నారు. కేంద్రంతో మంచిగా ఉంటే 10 రూపాయలు ఎక్కువగా రాష్ట్రానికి వస్తాయన్నారు. పట్టువిడుపులు అవసరమన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడితే తాను తెలుగువారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించానన్నారు.
వెంకయ్యకు బాబు కితాబు
హోదా, ప్యాకేజీల వ్యవహారమై కొందరు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని విమర్శిస్తున్నారన్నారు. ఆయన మన రాష్ట్రం నుంచి ఎన్నిక కాకపోయినా, రాష్ట్రానికి న్యాయం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. ఆయన చేయనంటే అన్యాయమైపోయి ఉండేవారమని గుర్తు చేశారు. ప్రజలకు మాత్రమే తాను భయపడతానని, ఇతరులెవ్వరికీ భయపడనన్నారు.
పరువు పోగొట్టుకున్నారు
కావేరి జలాల కోసం కర్ణాటక వ్యవహరించిన తీరు కారణంగా బెంగళూరు పరువు పాడు చేసుకున్నారన్నారు. 14 టిఎంసిల నీటి కోసం చాలా కాలంగా ఉన్న ఇమేజ్‌ను పాడుచేసుకున్నారన్నారు. ఒక సెంటీమీటరు వర్షపాతం పడితే 50 నుంచి 60 టిఎంసి వర్షపు నీరు లభిస్తుందని వివరించారు. ఒకప్పుడు తాను బెంగళూరుకు పోటీగా హైదరాబాద్‌ను ఐటి రంగంలో తీర్చిదిద్దాలని పోటీ పడ్డానని గుర్తు చేసుకున్నారు. రానున్న రెండుమూడేళ్లలో రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో వీధి దీపాలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసి అక్కడి నుంచి పర్యవేక్షిస్తామన్నారు. అక్టోబర్ 2 నాటికి అన్ని పురపాలక సంఘాలను బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించనున్నామన్నారు.