ఆంధ్రప్రదేశ్‌

నేటినుంచి బ్రిక్స్ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 13: పట్టణీకరణ వల్ల ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను కనుగొనే దిశగా బ్రిక్స్ దేశాల సదస్సు విశాఖ వేదికగా బుధవారం ప్రారంభం అవుతోంది. బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం ఆధ్వర్యంలో ఈ సదస్సు మూడు రోజుల పాటు జరుగుతుంది. పట్టణాల్లో పెరుగుతున్న జనాభా కారణంగా ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రానున్న రెండు దశాబ్దాలకు సరిపడా జనాభా అవసరాలను తీర్చేదిశగా పరిష్కారాలను కనుగొనేందుకు ఈ సదస్సు ఒక వేదిక కానుంది. పట్ణణీకరణ సమస్యలు ఎదుర్కొనేందుకు పర్యావరణ హితంగా, ఆకర్షణీయ నగరాలను ఏర్పాటు చేయాలి. వౌలిక సదుపాయాల కల్పన, ఇందుకు అవసరమైన ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఏర్పా టు వంటివి చర్చించేందుకు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల ప్రతినిధులు విశాఖలో సమావేశం కానున్నారు. 2030 నాటికి జనాభా అనూహ్యంగా పెరిగి నగరాలకు ఉపాధి కోసం వలసలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని బ్రిక్స్ దేశాల అంచనా. ఈ సవాళ్లను అధిగమించేందుకు, అనుభవాలను, అభిప్రాయాలను పరస్పరం పంచుకునేందుకు, ఉత్తమ పద్ధతులను అనుసరించేందుకు సదస్సు దిశానిర్దేశం చేయనుంది. పర్యావరణహిత నగరాల నిర్మాణం, నివాసయోగ్య నగరాలకు వౌలిక వసతులు, సదుపాయాలు, ప్లానింగ్, డెవలప్‌మెంట్, ఫైనాన్స్, తదితర అంశాలు చర్చకు రానున్నాయి.
ఈ నెల 14న మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే సదస్సులో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభోపన్యాసం చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఉపన్యాసం చేస్తారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, కేంద్ర పట్టణాభివృద్ధి కార్యదర్శి రాజీవ్ గౌబా, ప్రభుత్వ సిఎస్ ఠక్కర్ పాల్గొంటారు. చివరి రోజు విశాఖ డిక్లరేషన్‌ను ప్రకటిస్తారు.
chitram...
బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఫ్లైఓవర్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించిన దృశ్యం