ఆంధ్రప్రదేశ్‌

వాళ్లకు శిక్షలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 14: మహిళలపై జరిగే హత్యలు, అత్యాచారాల నిరోధానికి ఎన్‌కౌంటర్లే సరైన పరిష్కారమన్నట్టుగా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరించడం చూస్తుంటే వీరిద్దరికీ రాజ్యాంగమన్నా, కోర్టులన్నా గౌరవం లేదని రుజువవుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అభిప్రాయపడ్డారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు, జగన్మోహన్‌రెడ్డికి రాజ్యాంగమన్నా, కోర్టులన్నా గౌరవ లేదనే విషయం వాళ్ల మాటల ద్వారా, చేతల ద్వారా స్పష్టంగా రుజువవుతోందన్నారు.
‘దిశ’ సామాజిక వర్గమే కాబట్టే జగన్మోహన్‌రెడ్డి నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నారని తాము భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. కులం, మతంతో సంబంధం లేకుండా మహిళలపై జరిగే అత్యాచారాలను అరికట్టాల్సిన అవసరం ఉందని, వీలైతే మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలని సలహా ఇచ్చారు. షాద్‌నగర్ ఘటనకు మూడు గంటల ముందు వరంగల్‌లో మానసపై అత్యాచారం, హత్య, మూడు రోజుల ముందు లక్ష్మీ అనే మహిళ అసిమామాద్ జిల్లా అటవీ ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి గురై దారుణ హత్యకు గురైందని చెప్పారు. తెలంగాణలోనే ఖాజీపూర్ అనే గ్రామంలో ముగ్గురు బాలికలను శ్రీనివాసరెడ్డి అనే దుర్మార్గుడు మూడు సంవత్సరాల తేడాలో రేప్ చేసి చంపేశారని ఆయన తెలిపారు. కామంధుడైన శ్రీనివాసరెడ్డిని ఎన్‌కౌంటర్ చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు సలహా ఇవ్వగలరా?అని కృష్టమాదిగ ప్రశ్నించారు. తాజాగా గుంటూరులో ఐదు సంవత్సరాల బాలికపై లక్ష్మారెడ్డి (19) అత్యాచారం చేశాడని, దిశ చట్టం చేసిన రోజే ఈ ఘటన జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
లక్ష్మారెడ్డికి ఏ శిక్ష వేయనున్నారో శాసన సభలో ధైర్యం వుంటే జగన్మోహన్‌రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే కర్నూలు జిల్లా కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో యాజమాన్యం 2017లో ప్రీతిబాయి విద్యార్థిని ముగ్గురు రాత్రి పూట దారుణంగా అత్యాచారం చేసి అది బయట పడకుండా చేయడం కోసం హత్య చేసి వాళ్లే అమ్మాయి ఉరేసుకుందని నమ్మించేందుకు ఫ్యాన్‌కు ఉరేసి పోయారని ఆయన ఆరోపించారు. అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ నిందితులను నేటికీ అరెస్టు చేయలేదని తెలిపారు.