ఆంధ్రప్రదేశ్‌

అత్యున్నత వైద్య విజ్ఞాన సంస్థగా ‘స్విమ్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 4: దేశంలోనే అత్యున్నత వైద్య విజ్ఞాన సంస్థగా శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (స్విమ్స్)ను తీర్చిదిద్దుతామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
బుధవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి స్విమ్స్ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతానికి త్వరలో ఎయిమ్స్ అందుబాటులోకి రానుందని, ఉత్తరాంధ్రలో కింగ్ జార్జి ఆసుపత్రి సేవలందిస్తున్నట్లే రాయలసీమ ప్రజలకు స్విమ్స్ తలమానికంగా నిలిచిందన్నారు. కార్డియాలజీతో పాటు గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన అత్యాధునిక పరికరాల కొనుగోళ్లపై సమావేశంలో చర్చించారు.
ఉద్యోగుల పదోన్నతులు, ఆర్థిక సౌకర్యాల పెంపుపై సమీక్ష జరిపారు. స్విమ్స్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. సమావేశంలో తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్, తిరుపతి జేఈఒ బసంత్ కుమార్, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*చిత్రం... స్విమ్స్ అభివృద్ధిపై సమీక్షిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని