ఆంధ్రప్రదేశ్‌

ఆర్‌ఎస్‌ఐ అర్జునరావుకు సీఎం జగన్ ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 3: విజయవాడ కృష్ణలంక వద్ద బందరు కాలువలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డీ లక్ష్మి అనే మహిళను సురక్షితంగా కాపాడిన రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ అర్జునరావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. సోమవారం ప్రవాహంలో కొట్టుకుపోతున్న లక్ష్మిని చూసిన అర్జునరావు కాల్వలో దూకి కాపాడారు. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కాన్వాయ్ పైలెట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఘటనపై వివరించారు. అర్జునరావు సాహసాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు ప్రభుత్వం తరుపున సిఫార్సు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
*చిత్రం...ఆర్‌ఎస్‌ఐ అర్జునరావును అభినందిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి