ఆంధ్రప్రదేశ్‌

గిరిజన ప్రాంత కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల గౌరవ వేతనం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల గౌరవ వేతనాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ నెలకు 400 రూపాయలు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా చెల్లిస్తోంది. దీనిని నెలకు 4000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల రాష్ట్ర ఖజనాకు ఏటా 14.46 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. 2652 మందికి ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది.
రాష్ట్రంలో ఖేలో ఇండియా స్పోర్ట్సు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల పనితీరు పర్యవేక్షించేందుకు వీలుగా ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా యువజన మంత్రిత్వ శాఖ, శాయ్, ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్-చార్జి వ్యవహరిస్తారు. కాగా ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి మాజీ సైంటిస్టు బండి మరియ కుమార్ రెడ్డిని నియమించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఏపీ గ్రీన్ కార్ప్స్ డైరెక్టర్‌గా అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్సు ఆర్కే సుమన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.