ఆంధ్రప్రదేశ్‌

న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: న్యాయవాదుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించే ‘వైఎస్సార్ లా నేస్తం’ కార్యమ్రాన్ని మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ బటన్ స్విచాన్ చేసి అర్హులైన న్యాయవాదుల ఖాతాలో నగదు జమ చేశారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రతి నెలా రూ. 5వేలు నగదు జమవుతుంది. న్యాయవాదిగా నమోదు చేసుకున్న మూడు సంవత్సరాల వరకు ఈ సాయం
అందుతుంది. 36 సంవత్సరాల లోపు న్యాయవాదులకు వర్తిస్తుంది. దీంతో పాటు న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ. 100 కోట్లు నిధులు కేటాయించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తమ సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రికి న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం అవసరమైతే చట్ట సవరణలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, వైస్‌చైర్మన్ రామ జోగేశ్వరరావు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఏ రామిరెడ్డి, సీనియర్ న్యాయవాది చిత్తరువు నాగేశ్వరరావు, ఆర్ మాధవి, బార్‌కౌన్సిల్ సభ్యులు బీవీ కృష్ణారెడ్డి, వీ బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి