ఆంధ్రప్రదేశ్‌

బాబు డైరెక్షన్‌లో పవన్ యాక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 2: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఏమని పిలవాలో అర్థంకాని విధంగా ఆయన తీరు ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. ప్రతిపక్ష నేత అందామనుకుంటే కేవలం ఆయన పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చిందని, యాక్టర్ అని పిలవాలనుకుంటే ప్రస్తుతం ఆయన సినిమాలు ఆపేశారని, పుస్తకాలు చదివానని, తాను మేధావినని చెప్పుకుంటారు కాబట్టి మేధావి అని పిలుద్దామంటే అజ్ఞానిగా కన్పిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. మొత్తంగా ఆయన వ్యవహారశైలి, మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన మతి స్థిమితం కోల్పోయినట్లు అర్థమవుతుందని మంత్రి అనిల్‌కుమార్ వ్యాఖ్యానించారు. సోమవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన హచ్ యాడ్ మాదిరిగా వేర్ యు గో.. ఐ ఫాలో అన్నట్లు చంద్రబాబు ఏ డైరెక్షన్ ఇస్తే అలాగే పవన్‌కళ్యాణ్ దానిని అనుసరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ దమ్ము, ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 2014లో ప్రశ్నిస్తానని చెప్పి ఎవరినీ ప్రశ్నించకుండా అధికార పార్టీకి తొత్తుగా పవన్ వ్యవహరించారని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పినట్లు పదే పదే కేవలం జగన్మోహనరెడ్డి కులాన్ని, మతాన్ని ప్రస్తావించాలనే తపన తప్ప మరొకటి పవన్ వ్యాఖ్యల్లో కనిపించడం లేదని, ఆయన భాష చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. గోదావరి జిల్లాలకు వెళ్లి కడప ఫ్యాక్షన్ అని, రాయలసీమ గూండాలని చెప్పే పవన్, రాయలసీమకు వెళ్లి చదువుల సీమ అని చెప్పే ద్వంద్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కర్నూలులో 2017లో ఓ స్కూలు యాజమాన్యానికి, ఓ పాపకు మధ్య జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి జగన్‌కు ఆపాదిస్తూ మాట్లాడటం చూస్తే ఆయన వివేకమేపాటితో అర్థమవుతుందని ఎద్దేవాచేశారు. 2019 వరకు చంద్రబాబును ప్రశ్నించేందుకు ధైర్యం చాలలేదా అంటూ నిలదీశారు. ఇలాంటి మతిస్థిమితం లేని వ్యాఖ్యలు చేయబట్టే రాయలసీమలో డిపాజిట్లు కోల్పోయి, పోటీచేసిన రెండుచోట్లా భీమవరం, గాజువాకలో కూడా ఓటమి చవిచూశారని, ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే ఉన్న ఒక్క సీటు కూడా మిగలదని మంత్రి అనిల్ పేర్కొన్నారు.