ఆంధ్రప్రదేశ్‌

అలాంటివారిని కాల్చి చంపేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: శంషాబాద్ సంఘటన తరహాలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని అక్కడికక్కడే కాల్చి చంపేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. నిర్భయ చట్టాలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల వల్ల ఇలాంటి అఘాయిత్యాలు ఆగవని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పశువైద్యురాలు ప్రియాంకరెడ్డిపై హత్యాచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలను అమలు చేయాల్సి ఉందన్నారు. ఉపాధి కోల్పోయి, నిరాశ్రయులైన ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీ జివి హర్షకుమార్‌పై వైఎస్ జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను జైల్లో పెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందన్నారు. ఈ విధానం మంచిది కాదని హితవు పలికారు. జగన్ రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నించాలే తప్ప అణగదొక్కేందుకు ప్రయత్నించడం తగదన్నారు. హర్షకుమార్‌పై వేధింపుల వ్యవహారం ముఖ్యమంత్రి జగన్‌కు తెలిసే జరుగుతోందా లేక అధికారులే తప్పు చేస్తున్నారా అని విహెచ్ అనుమానం వ్యక్తం చేశారు. హర్షకుమార్‌కు న్యాయం జరిగినపుడే ఆజ్ఞాతం వీడి బయటకు వస్తారని ఆయన తెలిపారు. బ్రాహ్మణ కుటుంబానికి అన్యాయం జరిగితే ఒక్క బ్రాహ్మణ నాయకుడు స్పందించకపోవడం శోచనీయమన్నారు. అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై చెప్పులు, రాళ్లతో దాడి చేయడం తగదని స్పష్టం చేశారు. ఎవరు దాడి చేసినా ఆ నింద ప్రభుత్వంలో ఉన్న జగన్, ఆయన పార్టీ నాయకులే భరించాల్సి ఉంటుందన్నారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు