ఆంధ్రప్రదేశ్‌

నేవీ బ్యాండ్ కచేరీని ఆస్వాదించిన గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 1: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు నౌకాదళం ప్రధాన కార్యాలయం సాముద్రిక ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం జరిగిన నేవీ బ్యాండు కచేరీని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆస్వాదించారు. దాదాపు గంట పాటు సాగిన బ్యాండ్ కచేరీలో పలు దేశభక్తి గీతాలు, మనోహరమైన మధుర గీతాలు నేవీ వాయిద్యకారులు హృద్యంగా స్వరపరిచారు. అనంతరం దేశ రక్షణలో నౌకాదళ పాత్రపై సౌండ్ అండ్ లైటింగ్ షో ద్వారా నౌకాదళ సిబ్బంది అద్భుతంగా ప్రదర్శించారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి జాతీయ భద్రత, సముద్ర రక్షణ తదితర అంశాల్లో రక్షణ రంగ పాత్రను కళ్లకు కట్టినట్టు చూపారు. వౌలిక సదుపాయాలు కల్పించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం, విపత్తుల సమయంలో మానవతా సహాయం తదితర అంశాలను సౌండ్ అండ్ లైటింగ్ ద్వారా ప్రదర్శించి గవర్నర్ ప్రశంసలు అందుకున్నారు. కార్యక్రమంలో తూర్పునౌకాదళం ప్రధానాధికారి అతుల్ కుమార్ జైన్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.