ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థి సమగ్రాభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), నవంబర్ 17: ఒకటి నుండి ఐదో తరగతి వరకు పాఠ్యాంశాలను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) భావిస్తోంది. విషయాలను విస్తృతంగా కాకుండా లోతుగా నేర్చుకునేలా బోధన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. పాఠాలు చెప్పేందుకే విద్యా సంవత్సరమంతా సరిపోతే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సమయం ఉండబోదని భావిస్తోంది. ప్రస్తుత పాఠ్యాంశాలు ఎక్కువగా ఉన్నాయన్న విద్యావేత్తల వినతుల నేపథ్యంలో పాఠాల సంఖ్యతో పాటు కొన్ని పాఠాలను కుదించాలని ఏస్‌సీఈఆర్‌టీ యోచిస్తోంది. వచ్చే ఏడాది నుండి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టనున్నందున ఒకటి నుండి ఐదు వరకు ఆంగ్లంలో పుస్తకాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలతో పాటు సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలు, విదేశాల్లోని పాఠ్యపుస్తకాలను నిపుణుల కమిటీ పరిశీలించింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థుల ప్రమాణాలు పెంచేలా సీబీఎస్‌ఈ స్థాయిలో పాఠ్యాంశాలు ఉండేలా నమూనాలను రూపొందిస్తోంది. ప్రాథమిక తరగతుల బోధన 120రోజుల్లో పూర్తిచేసేలా పుస్తకాలు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పాఠశాల పనిదినాలు 220 రోజులున్నప్పటికీ సెలవులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాలతో బోధనకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు ఎస్‌సీఎఆర్‌టీ గుర్తించింది. దీంతో మొత్తం 120రోజుల్లో పాఠ్యాంశాలు పూర్తిచేసి మిగతా సమయంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, బోధన కొనసాగించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామ సచివాలయాల వ్యవస్థ మారినందున స్వపరిపాలన పాఠ్యాంశంలోనూ మార్పులు తేనున్నారు.