ఆంధ్రప్రదేశ్‌

సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రం రాజమహేంద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 14: సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్ర బిందువు రాజమహేంద్రవరం అని, ఆదికవి నన్నయ నడయాడిన ఈ నేల దేశానికే గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని గైట్ ఇంజినీరింగ్ కళాశాలల ప్రాంగణంలో గురువారం జరిగిన ధర్మ చైతన్య సభలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం, న్యాపతి సుబ్బారావుతో పాటు మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ, తిక్కన, ఎర్రన వంటి ఎందరో మహానుభావులు నడయాడిన రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక సభకు హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశం నలుమూలలా జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాల్లో పూరీ గోవర్ధన పీఠం ఆది పీఠమన్నారు. ఒడిస్సా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కాలంలో మూడు పర్యాయాలు పూరీ గోవర్ధన పీఠం సందర్శించానన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన గోవర్ధన పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతీ మహారాజ్‌ను ఈ రాష్ట్ర గవర్నర్ హోదాలో ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ధర్మచైతన్య సభలో పాల్గొన్న జగద్గురు శంకరాచార్య పూరీ గోవర్ధన పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి మహారాజ్ అనుగ్రహ భాషణం చేస్తూ రాజనీతికి, ధర్మ పీఠానికి సమన్వయంచేస్తూ ఈ సభను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ చైతన్యరాజు మాట్లాడుతూ పీఠాధిపతులు, రాష్ట్ర గవర్నర్ ఏకకాలంలో తమ విద్యాసంస్థకు రావడం ఎంతో శుభపరిణామం అన్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను చైతన్య విద్యా సంస్థల తరఫున చైతన్య రాజు, ఎండి కె శశికిరణ్‌వర్మ, కిమ్స్ ఎండీ కె రవికిరణ్‌వర్మ గజమాలతో, సత్కరించి జ్ఞాపికను అందించారు.
*చిత్రం... ధర్మ చైతన్య సభలో జ్యోతిప్రజ్వలన చేస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్