ఆంధ్రప్రదేశ్‌

ప్రైవేటు స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, నవంబర్ 13: కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్లు సమీపంలో బుధవారం ఓ ప్రైవేటు స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. పిల్లలను స్కూలుకు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డుపక్కన గుంతలోకి దూసుకెళ్లింది. పొలంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దరిదాపుల్లోకి వెళ్లి నిలిచిపోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని పట్టణంలోని శారద విద్యానికేతన్‌కు చెందిన బస్సు సమీప గ్రామాల నుంచి పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు తరలిస్తోంది. అదే క్రమంలో బుధవారం పిల్లలను పాఠశాలకు తరలిస్తుండగా నెట్టేకల్లు సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో సుమారు 60 మంది పిల్లలు ఉన్నారు. బస్సు గుంతలోకి దూసుకెళ్లడంతో పిల్లలంతా ఒక్కసారిగా ప్రాణభయంతో కేకలు వేశారు. బస్సు ఏమాత్రం ముందుకువెళ్లినా పొలంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొనేది. ప్రమాదం తప్పడంతో అంతా ఊపీరిపీల్చుకున్నారు.
*చిత్రం... అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లిన ప్రైవేటు స్కూలు బస్సు