ఆంధ్రప్రదేశ్‌

సహజ వనరులే ఏపీ సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 11: విస్తారంగా ఉన్న సహజ వనరులే ఆంధ్రప్రదేశ్‌కు సంపద అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. ముంబయిలో జరిగిన గ్లోబల్ కెమికల్స్, పెట్రో కెమికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ సదస్సులో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని రంగాల్లో ప్రపంచ స్థాయి పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అన్ని విధాలా అనుకూల వాతావరణం ఉందని స్పష్టం చేశారు. దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి, ఆదాయ రంగాలన్నింటినీ ఒకటిగా చేసేందుకు ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎర్ర తివాచీ పరుస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరించారు. పొడవైన సముద్ర తీరం ఉందని, ఏపీ తీరంలో గ్యాస్, చమురు వంటి సహజ వనరులు భారీగా ఉన్నాయన్నారు. అవే ఏపీకి అరుదైన సహజ సంపదగా తెలిపారు. రాష్ట్రంలో విశాఖ-కాకినాడ మధ్యలో పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇనె్వస్టుమెంట్ రీజియన్ కారిడార్‌లో పెట్టుబడుల గురించి మంత్రి వివరించారు. రానున్న ఐదేళ్లలో వివిధ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర రాష్ట్రంలో పెట్టుబడులు ముందుకు వస్తున్నాయన్నారు. ఏపీలో పారిశ్రామిక విధానం అమల్లో నాలుగు స్తంభాలు ఉంటాయన్నారు. పారదర్శకత, సుపరిపాలన, ప్రపంచ స్థాయి వౌలిక సదుపాయాలు, అపార మానవ వనరులు వంటి సానుకూల అంశాలతో భారత ప్రభుత్వం నిర్దేశించిన 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములవుతామన్నారు. భూ కేటాయింపులు, అనుమతులు వంటివి సింగిల్‌విండో విధానం అమలు చేస్తున్నామన్నారు. భారత్ నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాల్లో రాష్ట్ర వాటా పెంచాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఒడిశాకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.