ఆంధ్రప్రదేశ్‌

మూడు నెలల్లో అటవీ సమస్యలు కొలిక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 11: అటవీశాఖలో సమస్యలను మూడు నెలల్లో కొలిక్కి తీసుకొస్తానని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎన్.ప్రతీప్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ అటవీశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా అటవీశాఖలో 51 శాతం సిబ్బంది కొరత ఉందన్నారు. ముగ్గురు చేయాల్సిన విధులను ఇపుడు ఒక్కరే నిర్వర్తిస్తున్నారన్నారు. రానున్న జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. జాతీయ అటవీ చట్టం ప్రకారం రాష్ట్రంలో 33 శాతం విస్తీర్ణంలో మొక్కలు ఉండాల్సి ఉండగా జిల్లాలో 17 శాతం మొక్కలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కూడా 16 శాతం మొక్కలు ఉన్నాయన్నారు. దీనిని 33 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పదివేల కంపార్ట్‌మెంట్లు ఉన్నాయని వాటిలో 5500 కంపార్ట్‌మెంట్లలో మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బందికి వాహనాల కొరత ఉందని ఇందుకోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రూ.40 కోట్లు విడుదల చేశారన్నారు. త్వరలోనే సిబ్బందికి వాహనాలను పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కారానికి నిపుణుల అభిప్రాయం సేకరిస్తున్నామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రతీప్‌కుమార్ చెప్పారు. ఇప్పటికే ఏనుగులు పంటలను నాశనం చేయడం వల్ల నష్టపోయిన రైతులకు రూ.1.34 కోట్లు నష్టపరిహారం అందజేశామన్నారు. దాదాపు 1985 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని, వాటిలో 2152 మంది గిరిజనులు నష్టపోయారని వివరించారు. అటవీశాఖలో అవినీతి ఎక్కువగా చోటు చేసుకున్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా, అవినీతికి ఆస్కారం లేని శాఖగా మార్చాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో అదనపు సిసిఎఫ్ (విజిలెన్స్) ఎ.కె.ఝా, సిసిఎఫ్‌ఒ రాహుల్‌పాండే, డిఎఫ్‌ఒ జి.లక్ష్మణ్, సామాజిక అటవీశాఖ డిఎఫ్‌ఒ జానకిరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్‌ఒ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎన్.ప్రతీప్‌కుమార్