ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ చెల్లింపులకు గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 19: అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడత చెల్లింపులు జరపాలని హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం అందుకు తగిన ఆదేశాలు జారీచేసింది. తొలివిడత రూ. 10వేల లోపు డిపాజిటర్లు 3లక్షల 69వేల 655 మందికి రూ. 263.99 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. లీగల్ సెల్ ద్వారా చెల్లింపులు జరుపుతారు. తరువాత రూ. 20 వేల లోపు డిపాజిటర్లకూ చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కోర్టు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. హైకోర్టు అంగీకారం తెలిపిన వెంటనే రూ. 20 వేల లోపు వారికి కూడా చెల్లించేందుకు అధికారులు కసరత్తు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా తొలివిడత చెల్లింపుల కోసం రూ. 10 వేల లోపు ఉన్న డిపాజిటర్ల జాబితాను జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. గుంటూరు జిల్లాలో 19,751 బాధితులకు రూ. 14కోట్ల 9 లక్షల 41వేల 615, చిత్తూరు జిల్లాలో 8257 మందికి గాను రూ. 5కోట్ల 81లక్షల 17వేల 100, తూర్పుగోదావరి జిల్లాలో 19545 మంది బాధితులకు రూ. 11కోట్ల 46 లక్షల 87వేల 619, పశ్చిమ గోదావరి జిల్లాలో 35,496 మందికి రూ. 23కోట్ల 5 లక్షల, 98వేల 695, విజయనగరం జిల్లాలో 57941 మందికి రూ. 36 కోట్ల 97 లక్షల 96 వేల 900, శ్రీకాకుళం జిల్లాలో రూ. 45వేల 833 మందికి రూ. 31 కోట్ల 41లక్షల, 59వేల 741 చెల్లిస్తారు. ఇంకా నెల్లూరు జిల్లాలో 24వేల 391 మంది బాధితులకు రూ. 16కోట్ల 91లక్షల 74వేల 466, కృష్ణాజిల్లాలో 21వేల 444 మందికి రూ. 15కోట్ల 4 లక్షల, 77వేల 760, అనంతపురం జిల్లాలో 23,838 మందికి రూ. 20 కోట్ల 64లక్షల, 21వేల 009, వైఎస్సార్ కడప జిల్లాలో 18,864 మందికి రూ. 13కోట్ల 18 లక్షల 6వేల 875, ప్రకాశం జిల్లాలో 26వేల 586 మందికి 19 కోట్ల 11 లక్షల 50వేల 904, విశాఖపట్నం జిల్లాలో 52,005 మందికి 45 కోట్ల 10లక్షల 85వేల 805 రూపాయల నగదును జిల్లా స్థాయి లీగల్ కమిటీల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డిపాజిటర్లకు జగన్ బాసట: అప్పిరెడ్డి
గుంటూరు: గత కొంతకాలంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బాసటగా నిలిచారని, 10 వేల రూపాయలలోపు డిపాజిటర్లందరికీ చెల్లించనున్నట్లు వైసీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కో ఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ 3,69,655 మంది డిపాజిటర్లకు న్యాయం చేసే విధంగా డిఎల్‌ఎస్ ద్వారా వెంటనే వారి వారి బ్యాంకు ఖాతాల్లోకి ఈ సొమ్మును జమచేస్తారన్నారు. బాధితులెవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్క బాధితునికి న్యాయం జరుగుతుందని, ఆ దిశగా జగన్ అన్ని రకాల చర్యలు
తీసుకుంటున్నారని, త్వరలో 20 వేలలోపు వారికి చెల్లింపులు జరిపే విధంగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.