ఆంధ్రప్రదేశ్‌

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 16: జిల్లాల పర్యటనలో భాగంగా నెల్లూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటన పూర్తిచేశామని, వెళ్లిన ప్రతిచోటా కార్యకర్తల్లో ఉత్సాహంతో పాటు వైసీపీ వేధింపులు, అక్రమ కేసులతో వారిలో కసి పెరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు బాధితులు వెళ్లబోసుకున్న కష్టాలు వింటుంటే మనసు కలిచి వేసినట్లయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రొయ్యల చెరువుల ధ్వంసం, రౌడీషీట్ల పేరుతో బెదిరింపులు, సీనియర్ నేతలను ఊరు వదిలి వెళ్లాలంటూ హెచ్చరికలు, జర్నలిస్టులపై దాడులు, ప్రశ్నించే గొంతు నొక్కేయడం ఇలా ప్రతిచోటా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే అకృత్యాలే దర్శనమిచ్చాయని చంద్రబాబు అన్నారు. బుధవారం మూడు జిల్లాల పర్యటన ముగించుకుని గుంటూరు చేరుకున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక నేతలతో పలు అంశాలపై చర్చిస్తూ... ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై, శాంతి భద్రతలపై పోరాడితే తప్పేమిటన్నారు. అరాచకాలకు పాల్పడుతున్నది వైసీపీ నేతలైతే, పోలీసులు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ బాధితులపైనే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. వరుసగా టీడీపీ నేతలను హతమారుస్తున్నారని, పరిటాల రవీంద్రను దారుణంగా హత్యచేసినా ఈ కేసులో నిందితులు, సాక్షులు మొద్దు శ్రీను, గోవర్ధన్‌రెడ్డి, సాంబశివరావులు గొలుసుకట్టు హత్యలకు గురయ్యారన్నారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకునే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆంధ్రా పోలీసులపై మాకు నమ్మకం లేదని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చెప్పారని, ఎయిర్‌పోర్టులో విశాఖ పోలీసు కమిషనర్‌ను బెదిరించారని, నాడు పోలీసులనుద్దేశించి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలు మాట్లాడిన వ్యాఖ్యలు గుర్తుంచుకోవాలని సూచించారు. దళిత నాయకుడు కాబట్టే వర్ల రామయ్యపై మీసాలు తిప్పుతూ బెదిరింపులకు దిగుతారా అని నిలదీశారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే జగన్మోహనరెడ్డి హామీలు ఇచ్చారా అని ప్రశ్నించారు. కేంద్రం నుండి నరేగా కింద రూ.23 వేల కోట్లు తెచ్చి గ్రామాల్లో వౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. వరుసగా నాలుగేళ్లు రెండంకెల వృద్ధిరేటు సాధించామని మరువకూడదన్నారు. తాడేపల్లి వద్ద పార్టీ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ పనులకు అడ్డంకులు కల్పించేందుకు ఆక్రమణల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పనిచేసే కూలీలు వేసుకున్న షెడ్లు కూడా ఆక్రమణలని వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతల దివాలాకోరు తనానికి నిదర్శనమన్నారు. అధికారులు బృందాలుగా పదే పదే తనిఖీలు చేయడం, విద్యుత్ సరఫరా నిలిపివేసి పనులు సాగకుండా అడ్డుకోవడం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని మండిపడ్డారు. నవంబర్ 3వ తేదీన కార్యాలయ ప్రారంభోత్సవం చేస్తున్నామన్న అక్కసుతోనే నిర్మాణ పనులకు ఆటంకం కల్గిస్తున్నారన్నారు.
న్నారు.
*చిత్రం...టీడీపీ ముఖ్యనేతలతో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు