ఆంధ్రప్రదేశ్‌

ఏపీ అభివృద్ధికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన తోడ్పాటును అందించాలని అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్ ఆర్ రీఫ్ మెస్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోరారు. ప్రగతి కాముక ముఖ్యమంత్రి ఇక్కడ పని చేస్తున్నారని, తగిన సహకారం అందిస్తే మంచి అభివృద్ధిని సాధించగలుగుతారని వివరించారు. అమెరికన్ కాన్సుల్ జనరల్ రీఫ్ మెస్, ఇతర కాన్సుల్ సభ్యులు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిరువురి మధ్య విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా గవర్నర్ కోరారు. అమెరికన్ కంపెనీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా ప్రాంతాలకు చెందిన వారే గణనీయంగా విధులు నిర్వహిస్తున్నారని, మరింతగా వారికి అవకాశాలు వచ్చేలా చూస్తామని రీఫ్‌మెస్ తెలిపారు. గవర్నర్ తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి రీఫ్‌మెస్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. గవర్నర్‌కు అమెరికన్ కాన్సుల్ జనరల్ మెమొంటోను బహూకరించారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావు పాల్గొన్నారు.
*చిత్రం...గవర్నర్‌తో భేటీ అయిన అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్