ఆంధ్రప్రదేశ్‌

సీఎం జగన్‌తో అమెరికన్ కాన్సులేట్ జనరల్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్‌మాన్ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన తొలిసారి సీఎంను కలుసుకున్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సమయంలో రిఫ్‌మాన్ సమావేశమయ్యారు. గ్రామ సచివాలయాలతో పాటు పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, అవినీతి రహిత, పారదర్శక సుపరిపాలనలో భాగంగా అమలు చేస్తున్న విధానాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని ఆ మేరకు తగిన కృషి చేయాలని కోరారు. కాగా రాష్ట్రం చేపట్టిన పాలనా సంస్కరణలను రిఫ్‌మాన్ ప్రశంసించారు.

*చిత్రం...బుధవారం సచివాలయానికి వచ్చిన అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్‌మాన్ జ్ఞాపిక బహూకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్