ఆంధ్రప్రదేశ్‌

మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, అక్టోబర్ 15: చారిత్రక రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం నుంచి తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ మేథావిగా సుపరిచితురాలైన మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద(66) గుండెపోటుతో హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, మందసకు చెందిన మజ్జి శారద మాజీ పీసీసీ అధ్యక్షుడు మజ్జి తులసీదాస్ కుమార్తె. ఆది నుంచి కాంగ్రెస్‌లో ఉంటూ నేటి వరకు క్రియాశీలకపాత్ర పోషించారు. ఏఐసీసీ, పీసీసీ మెంబరుగా పనిచేశారు. మజ్జి తులసీదాస్ రాజకీయ వారసురాలిగా రాజకీయ అరంగ్రేటం చేసి గ్రూపు-1 ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో తనదైన ముద్రను వేసారు. శారద మరణంతో మందసలో మజ్జి కుటుంబానికి రాజకీయ శూన్యత ఏర్పడిందని శ్రేయోభిలాషులు, సన్నిహితులు పేర్కొంటున్నారు.