ఆంధ్రప్రదేశ్‌

అబ్దుల్ కలాం స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 15: సామాన్య కుటుంబంలో జన్మించి దేశ రాష్టప్రతి స్థాయికి ఎదిగిన అబ్దుల్ కలాం నేటి తరానికి స్ఫూర్తిప్రదాత అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం దివంగత మాజీ రాష్టప్రతి ఏపీజె అబ్దుల్ కలాం 83వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఇస్రో ప్రాజెక్టు డైరెక్టర్‌గా కలాం 1988లో రోహిణి శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించారన్నారు. పోఖ్రాన్-2 కార్యక్రమంలో ఇతర దేశాలకు తెలియకుండా రహస్యంగా మన దేశం అణు పరీక్ష జరపడంలో కలాం పాత్ర ఎనలేనిదన్నారు. మన రాష్ట్రానికి చెందిన డాక్టర్ సోమరాజుతో కలిసి అతి తక్కువ ధరకే పరికరాలు, మందులు అందేలా వైద్యరంగంలో విశిష్ట సేవలందించారని కొనియాడారు. దివంగత వాజ్‌పేయ్ ప్రధానిగా ఉండగా రాష్టప్రతిగా కలాం పేరును అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారన్నారు. ప్రజా రాష్టప్రతిగా దేశానికి ఎన్నో సేవలందించిన కలాం ఆశయాలు, ఆలోచనలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని లోకేష్ కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ చిన్నతనంలో అనేక కష్టాలు పడి కలాం విద్యాభ్యాసం సాగించారని, కృతనిశ్చయంతో, ఒక లక్ష్యంతో అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు వైద్యరంగంలో కూడా అబ్దుల్ కలాం విశేష సేవలందించారన్నారు. అనంతరం అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మహమ్మద్ నసీర్, దారపనేని నరేంద్రబాబు, వట్టికూటి హర్షవర్ధన్, షేక్ బాజీ, కనపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... అబ్దుల్ కలాంకు నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు