ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి తగ్గుతున్నట్లే తగ్గి తిరిగి పెరుగుతుండటంతో కృష్ణాజిల్లాలో నదీ పరివాహ ప్రాంతంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతానికి వరద తాకిడి కాస్తంత తగ్గుముఖం పడటంతో మొత్తం 70 గేట్లలో 10 గేట్లను పూర్తిగా మూసివేసి మిగిలిన 60 గేట్లను ఒక అడుగు మేర పైకి ఎత్తి 44వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలుతున్నారు. మరో 12వేల క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి నుంచి వరద తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
మజ్జి శారద మృతికి రఘువీరా సంతాపం
మాజీ ఎమ్మెల్సీ, దివంగత పీసీసీ అధ్యక్షుడు తులసీదాస్ కుమార్తె మజ్జి శారద మృతికి పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మంగళవారం వేకువజామున హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందిన మజ్జి శారద కుటుంబానికి ఆయన సానుభూతి తెలిపారు. ఆమె కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారన్నారు. 2019లో పలాస నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారన్నారు.
43 పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
నాలుగు జిల్లాల పరిధిలో పత్తి కొనుగోలు చేసేందుకు 43 కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీలుగా ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ల అధ్యక్షతన 8 మంది సభ్యులతో కమిటీని నియమించింది.
సీఎం క్యాంప్ కార్యాలయం కిటికీల ఏర్పాటుకు నిధులు
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో అల్యూమినియం కిటికీలు, తలుపులు ఏర్పాటు, తదితర పనుల నిమిత్తం 73 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక అనూప్ సింగ్‌ను బదిలీ చేసింది. తదుపరి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.