ఆంధ్రప్రదేశ్‌

‘నన్నయ’ ప్రొఫెసర్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 14: విద్యార్థినులు వేధిస్తున్నారనే ఆరోపణలొచ్చిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఇంగ్లీషు విభాగం అధిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ సూర్య రాఘవేంద్రను సస్పెండ్‌చేస్తూ యూనివర్సిటీ వైస్-్ఛన్సలర్ పి సురేష్ వర్మ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను విచారించడానికి ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రను డిస్మిస్ చేసి, తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ ఎంఏ మొదటి సంవత్సరం విద్యార్థినులు యూనివర్సిటీలో సోమవారం బైఠాయించి నిరసనకు దిగారు. నన్నయ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీషు కోర్సు చేస్తున్న విద్యార్ధినులను డాక్టర్ సూర్య రాఘవేంద్ర ప్రత్యేక క్లాసుల పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. అయితే ఈ ఫిర్యాదు తమకు ఉన్నత విద్యా మండలి నుంచి వచ్చిందని, ఈ మేరకు ప్రాథమిక విచారణ పూర్తిచేసి నివేదిక పంపించామని వీసీ డాక్టర్ ఆచార్య సురేష్ వర్మ తెలిపారు. విచారణకు బాధిత విద్యార్ధినులు అందుబాటులో లేరని చెప్పారు. అయితే వీసీ నియమించిన ఉమెన్స్ సెల్ నిజ నిర్ధారణ కమిటీ సోమవారం కూడా విచారణ నిర్వహించింది. విద్యార్థినులు భయంతో విచారణకు హాజరుకాలేదు. అయితే ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న 17 మంది విద్యార్థినులు విచారణకు హాజరయ్యారు. తాము గత నెల 17న వీసీకి ఫిర్యాదు ఇచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదని వారు నిజనిర్ధారణ కమిటీ సభ్యులను ప్రశ్నించడంతో, ఆ ఫిర్యాదు సంగతి తమకు తెలియదని, ముగ్గురు విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని ఉమెన్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ నూకరత్నం సమాధానం చెప్పారు. వైసీపీ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి తులసి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్, ఏపీసీఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు, న్యాయవాది పల్లి చంద్రశేఖర్ తదితరులు అక్కడికి చేరుకుని విద్యార్థినులను వేధిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్‌చేశారు. సూర్య రాఘవేంద్ర తమకు వాట్సాప్‌లో మెసేజ్‌లు, ఫొటోలు పంపేవారని విద్యార్థినులు మహిళా నాయకులకు చూపారు. మహిళా నాయకులు సూర్య రాఘవేంద్రను వీసీ ఛాంబర్‌కు పిలిపించి నిలదీశారు. తాను చేసింది తప్పేనని ఒప్పుకున్న సూర్యరాఘవేంద్ర కొద్దిసేపటికే మాట మార్చి తాను ఆ మెసేజ్‌లు పంపలేదని, తన వాట్సాప్ నంబర్ వేరని చెప్పుకొచ్చారు. విచారణ పూర్తయ్యేంత వరకు రాఘవేంద్రను సస్పెండ్ చేయాలని విద్యార్థినులు, మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేయడంతో సస్పెండ్ చేస్తూ వీసీ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చారు.
ఏడుగురు సభ్యులతో విచారణ కమిటీని నియమించారు. ప్రొఫెసర్లు ఎస్ ప్రశాంతిశ్రీ, ఎస్ నూకరత్నం, వి పెర్సిస్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్ లింగారెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వి విజయకుమారి, అమలాపురానికి చెందిన ఎన్జీవో నాయకులు కె స్వర్ణలత, ఐద్వా జిల్లా కార్యదర్శి తులసిలతో ఈ కమిటీని ఏర్పాటుచేశారు.