ఆంధ్రప్రదేశ్‌

బోయ వాల్మీకులను ఎస్టీల్లో చేర్చొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: రాష్ట్రంలోని బోయ వాల్మీకులను, ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దని ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొట్టడం రాజబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మోట రాముడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక దాసరి నాగభూషణరావు భవన్‌లో సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ ఏ గా ఉన్న బోయవాల్మీకులను ఇతర కులాలను గిరిజన జాబితాలో కలుపుతామని రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్టీలకు ఇప్పుడున్న రిజర్వేషన్ ప్రస్తుత గిరిజన జనాభాకు తగ్గట్టుగా లేదని, అదే సమయంలో ఇతర కులాలను గిరిజన జాబితాలో కలిపితే నిజమైన ఆదివాసీ గిరిజనులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇతర కులాలను గిరిజన జాబితాలో చేర్చితే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు.