ఆంధ్రప్రదేశ్‌

యురేనియం తవ్వకాలు ఆపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతున్న యురేనియం తవ్వకాలు ఆపాలని, ఈ విషయపై నెల్లూరు జిల్లాలో ఈ నెల 18న పర్యటించాలని పలు ప్రజాసంఘాలు నిర్ణయించాయి. ‘యురేనియం తవ్వకాలు ఆపాలి- ప్రజారోగ్యం కాపాడాలి’ అంటూ సోమవారంఇక్కడ చర్చా వేదిక నిర్వహించారు. వివిధ ప్రజాసంఘాలు పాల్గొన్న ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. యురేనియం కోసం బోర్లు వేసిన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, తియ్యకంచపాడును ఈ నెల 18న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సందర్శించాలని, 13 జిల్లాల్లో చర్చా వేదికలు నిర్వహించి ప్రజా సంఘాలను భాగస్వామ్యం చేయాలని, యురేనియం తవ్వకాలు ఆపాలని కోరుతూ సంతాలు సేకరించి రాష్టప్రతికి పంపాలని, అలాగే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించాలని తీర్మానాలు చేశారు. ప్రోగ్రెసివ్ ఫోరం, ఏఐవైఎఫ్, ఇండియన్ డాక్టర్స్ పీస్ అండ్ డెవలప్‌మెంట్, డీవైఎఫ్‌ఐ, ఏపీ మహిళా సమాఖ్య, ఏఐఎస్‌ఎఫ్, ఏపీ ప్రజానాట్యమండలి, జనసేన యువజన విభాగం, ఏపీ గిరిజన సమాఖ్య తదితర సంఘాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.