ఆంధ్రప్రదేశ్‌

ఎపెక్స్ కౌన్సిల్ కొనసాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన ఎపెక్స్ కౌన్సిల్ కొనసాగించకపోతే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఏపీ రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు హెచ్చరించారు. విజయవాడలోని సమాఖ్య కార్యాలయంలో సోమవారం కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అధికారికంగా ఏర్పాటైన సంస్థ ఎపెక్స్ కౌన్సిల్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులకు సంబంధించి ఏ విధమైన జల వివాదాలు వచ్చినా దానిద్వారా పరిష్కారం చేసుకోవటానికి అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతగా ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరులో జరగవల్సిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేయమని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని అదేబాటలో ఏపీ ప్రభుత్వం కూడా పయనించబోతోందని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, ఇది ఏపీ హక్కులకు తీవ్ర భంగం కలిగించే విషయమని అన్నారు. ఎపెక్స్ కౌన్సిల్ ఎజెండా విషయం ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దగ్గర ఉందని ఈ ఎజెండాలో ఉన్న అంశాల మీద చర్చించి ఏపీ రాష్ట్ర హక్కులను కాపాడవల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉందన్నారు. అదే విధంగా విభజన చట్టం ప్రకారం ఏర్పడిన కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నది యాజమాన్ని బోర్డు (జీఆర్‌ఎంబీ)ను కొనసాగించవల్సిన అవసరం ఉందన్నారు.