ఆంధ్రప్రదేశ్‌

వివేకా హత్య కేసు తారుమారుకు యత్నం: వర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 14: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుని తారుమారు చేయబోతున్నారని, ఈ కేసుతో సంబంధం లేనివారిని నిందితులుగా చూపే క్రమంలో కేసుని మసిపూసి మారేడుకాయ చేసే యత్నాలు జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. సోమవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివేకా హత్యకేసులోని దోషులెవరో, వారికి ఎందుకు అరెస్ట్ చేయడం లేదో, దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రశ్నించే హక్కు బాధ్యతగల పౌరుడిగా, ప్రతిపక్షనేతగా తనకుందని వర్ల స్పష్టం చేశారు. వివేకాను చంపింది ఎవరో పులివెందులలో అందరికీ తెలుసంటున్నారన్నారు. అలాగే జగన్‌కు, వివేకా కుమార్తె సునీతకు కూడా వారెవరో తెలిసినప్పటికీ, ఒక్క రోజు కూడా వారిద్దరూ దోషుల గురించి మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. తన బాబాయి హత్యకేసులో అస్మదీయులే ప్రధాన నిందితులనే విషయం జగన్‌కు తెలుసు కాబట్టే వారిని కాపాడుకోవడం కోసం కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన వారిని అరెస్ట్ చేస్తే ఏమవుతుందోనన్న భయం జగన్‌ను వెంటాడుతోందన్నారు. కేసులో అసలు దోషులెవరో బయటపెట్టి, తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన జగన్, ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని నిలదీశారు.